ఫీలింగ్
naa telugu kathalu ఫీలింగ్ భార్యాభర్తల మధ్య సెక్స్ ఒక చక్కని కమ్యూనికేషన్. భార్యాభర్తల మధ్య ఎఫెక్షన్ తో కూడిన శారీరక సాన్నిహిత్యం ఒక చక్కని 'రిలీఫ్' ఈ మూడింటిని 'మిస్' అవుతున్నాడు మీనన్. దానిక్కారణం చిన్న సైకలాజికల్ ఫీలింగ్. మీనన్ ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ చైర్మన్ అయిన నలభై అయిదేళ్ళ మీనన్ ఇప్పుడు తీవ్రమైన మానసిక సంఘర్షణలోనవు తున్నాడు. ఎంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ వున్నా అది లక్షల విలువచేసే 'అసైన్ మెంట్' అయినా సాయంత్రం ఆరు దాటిందంటే అన్నింటినీ వదిలేసి ఇంటికి వెళ్ళే మీనన్ ఇప్పుడు ఎనిమిది దాటినా ఇంటికి వెళ్ళడం లేడు.
అతని టేబుల్ మీద వున్న సెల్ ఫోన్ ప్రతి పదినిమిషాలకోసారి రింగ్ అవుతూనే వుంది. ఆ ఫోన్ కాల్ ఇంటినుంచి అని, అది తన భార్య విశిష్ట చేసే ఫోన్ అనీ తెలుసు. ఒక ఊహాతీత ఉద్వేగాన్ని అణుచుకుంటూ ఒక నిరాశ-నిట్టూర్పులతో కూడిన సంఘర్షణను అనుభవిస్తూ అలా ఉండిపోయాడు. చైర్మన్ ఛాంబర్ లోకి వచ్చి 'సార్ ... టైమైంది' అని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది. ఈ పాటికి విశిష్ట చేసే కంగారు అతనికి అర్థమవుతూనే వుంది. అయినా సరే ఏమీ చేతకాని వాడిలా నిస్సహాయంగా వుండిపోయాడు.
ఒంట్లో చిన్న వణుకు ... చిన్న కంపరం ... చిన్న గగుర్పాటు. గత పదిరోజులుగా అతనీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూనే వున్నాడు. భార్య ప్రెజెన్స్ అతనికిష్టం, భార్యతో శారీరక సాన్నిహిత్యం అతనికింకా ఇష్టం. ఈ ఇష్టమైన రెండు విషయాలను ఇప్పుడు విస్మరిస్తూ తన మనసును కష్టపెట్టుకుంటూ వుండిపోయాడు. సరిగ్గా పదిరోజుల క్రితం శరీరంలో అలసట, అనీజీనెస్, కళ్ళు తిరుగుతున్నా ఫీలింగ్, చిన్నపాటి వణుకు. వెంటనే ఫ్యామిలీ డాక్టర్ ని కలిశాడు భార్యకు చెప్పకుండానే.
పరీక్షలన్నీ పూర్తయ్యాక చెప్పాడు ఫ్యామిలీ డాక్టర్ "సారీ సర్ ... షుగర్ ఎటాక్ అయింది. కాస్త బి.పి.కూడా వుంది. అయినా నో ప్రాబ్లెం ... రెగ్యులర్ గ మందులు వాడితే సరి ... రోజూ ఎక్సర్ సైజులు కూడా చేయండి'' భార్యకు డాక్టర్ చెప్పిన విషయం చెప్పలేదు. వయసు మరో పదేళ్ళు పెరిగిన ఫీలింగ్. ఆ రాత్రి విశిష్ట భర్త దగ్గరికి వచ్చింది. ఎప్పటిలానే అతనికిష్టమైన పింక్ కలర్ నైటీ వేసుకుంది. ముప్పయి ఆరేళ్ళ విశిష్ట పదేళ్ళ వయసు తగ్గినట్టు ఉంటుంది. ఆమె పెదవుల