శృంగార నగరం 22
ఆమె నీలం పూలున్న గ్రీన్ షిపాన్ చీర కట్టుకుంది. వెనక భాగం బాగా కనిపించేటట్టు కుట్టిన జాకెట్ వేసుకుంది. ఆమె వెనక భాగం అంతా విశాలంగా కనిపిస్తూ పెద్దింటి ముందు వేలాడదీసిన టులెట్ బోర్డులా అనిపిస్తుంది.
ఆమెకు రెండేళ్ళ క్రితమే వివాహం జరిగింది. ఇంకా పిల్లల్లేరు. ఆమె భర్త పరమేశ్వరరావు శృంగారపురంలో పెద్ద రైతు.
గోపాలకృష్ణ ఎక్కడా కనపడకపోయేసరికి కాస్తంత నీరసం ఆవహించింది. కానీ పట్టు వదలకుండా కొండ ఎక్కుతోంది.
ఎవరో ఆకతాయి కుర్రాడు గబుక్కున చందమామ మీదున్న ముసుగును లాగేసినట్టు మబ్బులు తొలిగాయి. వెన్నెల ఒక్కసారిగా లోకం మీదకు జారింది. ఆ వెలుగులో తల పైకెత్తిన ఆమెకు డాబా మీద పిట్టగోడకు ఆనుకొని తననే చూస్తున్న గోపాలకృష్ణ కనిపించాడు.
ఆమె ఎంతో సంతోషంగా చేయి వూపింది.
అతను చేయి వూపాడు.
ఆమె పరుగులాంటి నడకతో మెట్లెక్కి డాబా చేరుకుంది.
వూరికంతా ఎత్తుగా మబ్బుల మధ్య వూగుతున్నట్లు తెల్లటి పరుపు కనిపించింది. దానిమీద కూర్చుని "హమ్మయ్య నువ్వు కనపడకపోయేసరికి ఏమైనావోనని హడలిపోయాను" అంది ఆయాసాన్ని దిగమింగుకుంటూ.