శృంగార నగరం 18
ఈ సమయాల్లో అతని అవస్థ చూడాల్సిందే. మా అక్క అలా రెచ్చగొట్టినప్పుడు అతని షర్ట్ చెమటతో తడిసి ముద్దయ్యేది. కాళ్ళూ చేతులూ వణికేవి. గుండె శబ్దం మాకు విన్పించేది. మా అక్క అంతగా రెచ్చగొట్టినా డైరెక్టుగా ప్రొసీడ్ అయ్యే గట్స్ గానీ- చొరవగానీ లేవు.
కొన్నిరోజులకు అతను మా అక్క పెంపుడు కుక్కే అయ్యాడు. అది కాలుతో చెప్పిన పని చేతులతో చేసేవాడు దానికి ఉద్యోగపు అప్లికేషన్లు వేసే దగ్గర్నుంచి చివరికి దాని లంగా పూసులు తెగిపోతే వెళ్ళి కుట్టించుకు వచ్చే వరకు అన్ని పనులు ఎంతో ఆనందంగా చేసేవాడు.
తన ప్రేయసి చెల్లెళ్ళుగా మాకూ పనులు చేసేపెట్టేవాడు. చివరికి మేము యెలా తయారయ్యామంటే అతను లేకపోతే ఏ పనీ చేసుకోలేని స్థితికి వచ్చాము.
తెల్లవారి లేచి బాగా డ్రస్ అవ్ అయి వచ్చేవాడు. మాతో గడపడానికి టైమ్ చాలడం లేదని కాన్వెంట్ నడపడానికి ఓ వ్యక్తిని కుదుర్చుకున్నాడు. ఉదయం అలా రాగానే మా అందరికీ గుడ్ మార్నింగ్ లు చెప్పి ఏమైనా కావాలా అని అడిగేవాడు.
మా అమ్మ యిచ్చిన చేతిసంచిని తీసుకుని కూరగాయల మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పట్టుకొచ్చేవాడు. మేము చెప్పిన ఐటమ్ లు మాకిచ్చి, తనకోసం తెచ్చుకున్న కూరగాయల్ని వేరుగా ప్యాక్ చేసుకునేవాడు ఇక హాల్లో కూర్చుని కబుర్లు ప్రారంభించేవాడు.
సుగుణ అతడు వున్న ఏమీ జంకు లేకుండా డ్రస్ చేసుకునేది. అలా ఆమె తన గదిలో డ్రస్ చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ దొంగచాటుగా చూసేవాడు. ఆ పిల్లా అలా కావాలనే తన అందాలన్నిటినీ అరవా కొరవగా చూపిస్తూ అతన్ని రెచ్చగొట్టేది.