యువరాజు 16
telugu sex stories rebus-dm.ru యువరాజు 16 సుమతి ఆనందానికి అవధులు లేవు, గంతులోస్తూ ‘‘అమ్మగారు... అమ్మగారూ... అబ్బాయ్ గారు సుపర్ అమ్మగారు...’’ అంది సుమతి. ‘‘అబ్బ మొహం చూడు... ఆనందంతో కళకళలాడిపోతోంది...’’ అంది ఉమాదేవి. ‘‘నిజమే అమ్మగారు నేను ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను, రేపటి నుండి చక్కగా మీతోనే ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, డబ్బుల కోసం వెతుక్కోవక్కర్లేదు’’ అంటూ చిట్టా మొదలు పెట్టింది. ‘‘సర్లే గానీ, ఒక్క నిమిషం కూర్చో... నీకు నేను కొన్ని విషయాలు చెబుతా... ఆ అబ్బాయి చాలా మంచివాడు మన మీది మంచి అభిప్రాయం ఉంది. అది పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, అతనికి మన వల్ల చిన్న ఇబ్బంది కూడా రాకూడదు గుర్తుపెట్టుకో, రేపటి నుండి నువ్వు బయట తిరగడానికి వెళ్ళకు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచీ ఎవడోకడు తగులుతాడు వాడి కోసం నువ్వు అటో ఇటో పోతావ్. రేపటి నుండి నీకు కూడా మా ఇంట్లోనే వంటచేసుకుందాం. అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం కాదు, ఆయన అవసరాలు తెలుసుకుని ముందు చేసేలా ఉండాలి, నీ కేమైనా తెలియకపోయినా, అర్ధ కాకపోయినా ఆయనతో వాదులడకు, నన్ను అడుగు నేను చెబుతాను, అందరితో మాట్లాడినట్టు కాకుండా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, ఆయన కోసం ఎవరైనా వస్తే వాళ్ళతో కూడా మర్యాదగా ఉండటం నేర్చుకో. మంచి జీతం ఇస్తానన్నారు కదా అని పిచ్చి పిచ్చిగా ఖర్చలు పెట్టకుండా, జాగ్రత్త చేసుకో... ఆయన ఇక్కడ పర్మినెంట్ గా ఉండరు... కాబట్టి ఆయన ఉన్నంత కాలం, జాగ్రత్తగా ఉండి నాలుగు రూపాయలు దాచుకుంటే... భవిష్యత్తు బాగుపడుతుంది...’’ అంటూ సుమతి మొహం చూసింది.... తన మొహం చూస్తే ఉమాదేవి చెప్పిందేమీ వింటున్నట్టు లేదు. ‘‘ఉసే... నేను చెప్పేది ఏమైనా విన్నావా? ఏం ఆలోచిస్తున్నావ్?’’ అంది ఉమాదేవి గదుముతూ. ‘‘అబ్బాయిగారు భలే ఉన్నారు కదా అమ్మగారు... సినిమా హీరోలా ఉన్నారు’’ అంది సుమతి. ‘‘ఉసే... అంటే.... నేను చెప్పంది ఏమీ వినలేదా...!’’ అంది ఉమాదేవి. ‘‘విన్నా అమ్మగారు, అన్నీ మీరు చెప్పినట్టే చేస్తా... జాగ్రత్తగా ఉంటాను, మర్యాదగా ఉంటాను, డబ్బులు కూడా జాగ్రత్త చేసుకుంటాను, సరేనా... అయినా అమ్మగారు అబ్బాయ్ గారు ఏంటండీ మరీ అలా ఉన్నారు... ఆయన్ని అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది’’ అంది సుమతి. ‘‘చూశానే... ఇందకా నువ్వు ఆయన్ని తినేసేలా చూస్తున్నావ్ గా... అంటూ నిజమేనే అబ్బాయ్ చాలా బాగున్నాడు... ఆ కళ్ళు మాత్రం చాలా డేంజరే... ఆ కళ్ళల్లో ఏదో పవరుంది... ఎవరినైనా ఆకర్షించేస్తుంది...’’ అంటూ ‘చీ... ఏంటీ నేను కూడా అలా ఆలోచిస్తున్నాను అనుకుని’ - ‘‘సరేలే ముందు అబ్బాయ్ లేవగానే దిష్టి తీయ్ మన దిష్ఠే తగిలేలా ఉంది’’ అంది ఉమాదేవి. ‘‘నిజమే అమ్మగారు అబ్బాయ్ గారు లేవగానే ముందు దిష్టి తీసేస్తా’’ అంది సుమతి. ‘‘ఇంతకీ మీరిద్దరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? గుమ్మం ముందున్న స్పోర్ట్స్ బైక్ ఎవరిది?’’ అంటూ అడిగింది, ఇందాకటి నుండీ వాళ్ళ మాటలు వింటున్న శ్రీదేవి. వామ్మో ఇదెప్పుడు వచ్చింది అనుకుని ‘‘ఎవరూ లేరు, పైన అద్దెకి వస్తారన్నాగా ఆ ప్రిన్స్ గారు వచ్చారు, ఆ బైక్ ఆయనదే’’ అని ముందు వెళ్ళి ప్రెష్ అయిరా అంటూ ఉమాదేవి కిచెన్లోకి