విజయ్ ఒక భర్త కథ 23
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 23 అయినా ఒక్క రాత్రి లో ఇన్ని పుస్తకాలు చదవగలిగావంటే నీకు స్థితప్రజఞత ఎక్కువనుకుంటా....అంటూ నవ్వాడు.
ఆయన చెప్పిన పదానికి అర్థం తెలియక అందులో నవ్వేటంత విషయం ఏముంది అని ఆయన వైపు చూడగానే... సారీ..దీనికి నవ్వాల్సిన అవసరం లేదు కదా అనగానే....
ఇప్పుడు నిజంగానే నవ్వొచ్చింది విజయ్ కి...
అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్న... మళ్ళీ చీకటి పడేలోపు వచ్చేస్తా...నీకేఅవసరం ఉన్న ఛోటు చూసుకుంటాడు...సరేనా అంటూ వెళ్లిపోయాడు....
ఆయన వెళ్లి పోయాక మళ్ళీ పుస్తకం లో మునిగి పోయి దాదాపు రెండు మూడు గంటల వరకు చదివి మొత్తం అవగొట్టేసాడు...ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందతనికి...ఏదో ప్రకృతి లోని రహస్యం తెలిసిందతనికి... దానికి కారణం తను ఇప్పుడు చదివిన పుస్తకాలన్నీ పంచభూతాలను సూచించేవి...అవే కాదు అక్కడ ఉన్న అన్ని పుస్తకాలు జీవితం మీద ఉన్న థృక్పదం ను మార్చి వేస్తాయి.....May be భాయీజాన్ గారికి పుస్తకాలు మీద మంచి పట్టు.... జీవితం మీద మంచి అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది...
కొద్ది సేపటి తరువాత ఛోటు టిఫిన్ తెచ్చిన తర్వాత టిఫిన్ తిని తనతో మాట్లాడుతూ ఉండగా సడన్ గా పై అంతస్తులో నుంచి శబ్దాలు వస్తున్నాయి... నేను కంగారు పడుతు