రెండు రోజుల తర్వాత నీ అడ్రస్ ద్వారా ఫోన్ నంబర్ కనుక్కుని మీ ఇంటికి ఫోన్ చేసాను...
కానీ అవతల ఫోన్ ఎత్తిన ఆడమనిషి నువ్వు ఏమైపోయినా తమకు అవసరం లేదన్నట్లు మాట్లాడింది... అందుకే మళ్ళీ వాళ్లకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు... అంటూ ముగించాడు...
ఇక్కడి నుండి కొనసాగింపు......
ఆయన చెప్పిన మాటలు విన్న తరువాత విజయ్ కు ఒక్క విషయం బాగా అర్థం అయింది....అతనికి తన పేరు.... ఊరు...తప్ప ఇంకేం తెలియదు అని..
ఇంటికి ఫోన్ చేసి చెప్పాక కూడా నా గురించి అవసరం లేదని అన్నారా ? అంటే రమ్య పూర్తిగా నన్ను వదిలించుకోవాలని అనుకుంటుందా? తనకు వాడు తప్ప నేను అక్కర్లేదా?లేకపోతే అలా ఎందుకు అంటుంది... రోడ్డు మీద పడి చని పోయే నన్ను నాతో ఏ సంబంధం లేకపోయినా నన్ను కాపాడి తీసుకువచ్చి నెల రోజుల నుండి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అలాంటి ఈయనకు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి??అంతే.......
అప్పటి వరకు రమ్య పై ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా ఆవిరైపోయింది.... గుండెల్లో ఉన్నది కళ్ళ ల్లో నుండి కారుతున్న నీళ్ల లాగా బయటికి కారుతుంటే వాటిని రెండు చేతులతో తుడుచుకుంటు