విజయ్ ఒక భర్త కథ 21
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 21 విజయ్ కి అది కూడా అర్థం కాక చూస్తూ ఉంటే ఆయన అవునయ్యా కుటుంబరావు నీ మనసే నిన్ను ఇన్ని రోజులు ఇలా కోమాలో ఉండేలా చేసింది లేకపోతే నీకు తగిలిన దెబ్బలకు ఏ రెండు మూడు రోజుల్లోనే సృహవచ్చి ఉండేది... కానీ నీ మనసు మాత్రం చావాలని బలంగా మంకు పట్టు పట్టుకుని కూర్చుంది దాదాపు నెల రోజులు నీతో ఆమరణ నిద్రాహార దీక్ష చేయించింది....మరి ఇప్పుడు ఏమనుకుందో ఏమో దీక్ష విరమించినట్టుంది.... ఇప్పుడు ఇంకేం భయం లేదు ఇది నా క్లినిక్కే నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో సాయంత్రం అన్ని వివరంగా మాట్లాడుకుందాం అని అంటూ వెళ్ళబోతూ ఉంటే విజయ్ మళ్లీ అది కాదు సార్ అని ఏదో అడగబోయే లోగా ఆయన వెనక్కు తిరిగి చెప్పాను కదా సాయంత్రం అన్ని మాట్లాడుకుందాం అని నువ్వు కంగారు పడకయ్య క్రిష్ణా రావు అని చెప్పి వెళ్ళిపోయాడు....
విజయ్ కి అంతా విచిత్రంగా అనిపిస్తోంది ఆయన వయసు కి మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు చాలా హుందాగా కనిపిస్తున్నాడు... కానీ చలాకీగా మాట్లాడుతున్నాడు సొంత మనిషిలా కలిసిపోతూ పిలవడం కూడా బాగానే ఉంది కానీ ఆయన కొత్త కొత్త పేర్లు అన్నీ తనకు నామకరణం చేస్తుంటే నవ్వొస్తోంది అతనికి.....కొద్దిసేపు అలాగే మంచంపై వాలి తన ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో ....
అసలు రమ్య ఎలా ఉందో అని ఆలోచిస్తూ నేనసలు ఎక్కడున్నాను ఇది.... ఆయన ఏమో దీన్ని క్లినిక్ అంటున్నాడు కానీ నాకు అలా అనిపించడంలేదు హాస్పిటల్ లో ఉండే వస్తువులు ఒక్కటి కూడా లేవు ఏదో పాతకాలంనాటి భవంతి లా ఉంది అని చాలాసేపు వరకు మంచం మీద దొర్లి నిద్రపట్టక లేచి