విజయ్ ఒక భర్త కథ 18
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 18 అంత బాధలో కూడా విద్య ముఖం చూడగానే హారికకు నవ్వాగలేదు.. మనసులో ఎంతైనా తనకు పుట్టినోడు కదా వాడి ఆకలి గురించి కన్న తండ్రిలా బాగానే ఆలోచించాడు అనుకుంది.. విద్య ఏం చెప్పకుండా రమ్య ఒడిలో నుండి బాబుని తీసుకొని తన ఒడిలో పడుకోబెట్టుకుని అజయ్ తెచ్చిన పాలు పట్టిస్తోంది.. రమ్య ఇదేo పట్టించుకోకుండా బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది.. మాటిమాటికి తన ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తే అది మురళి నుండి…. ఫోన్ చూసి కట్ చేస్తుంటే మళ్లీ మళ్లీ కాల్ వస్తుండడంతో విసుగెత్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టింది. విద్య బాబుకు పాలు పట్టేసి.. ఫోన్ మురళి నుండి అని చూసి రమ్యతో ఫోన్ కట్ చేయడం ఎందుకో… ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదేదో సీక్రెట్ లాగా దాచడం దేనికి అని అంటుంటే ముందున్న గౌతమ్ విద్యను ఊరుకోమని సైగ చేశాడు. ఇక కొద్దిసేపు ఎవరు మాట్లాడకుండా ఉండే సరికి అజయ్ వేగం పెంచుతూ రెండు గంటల కల్లా ఆ లొకేషన్ కి చేరుకున్నారు… దగ్గరికి వెళ్ళగానే అక్కడ అంతా జనంతో ఉండడంతో పక్కనే కారు ఆపి దిగి వెళ్తుంటే అక్కడున్న పోలీసులు ఎదురు వస్తూ ఇప్పుడే కాల్ చేద్దామని అనుకుంటున్నాo… ఇంతలో మీరు వచ్చేశారు అంటూ గౌతమ్ ను అజయ్ ను తీసుకొని లోపలికి వెళుతుంటే వెనకాల లేడీస్ కూడా వాళ్ళతో పాటే వెళ్లారు.. అప్పుడే లోయలో పడ్డ కారుని క్రేన్ సాయంతో గాల్లోకి లేపుతూ ఉండడంతో కార్ ను చూసిన వెంటనే రమ్యకు నోట మాట పడిపోయింది… హారిక ఇoక విద్య ఏం అర్థం కానట్టు గౌతమ్ వైపు చూడడంతో ముందే ఇదంతా తెలిసిన గౌతమ్ అవునంటూ తలూపాడు… అంతే హారిక తట్టుకోలేని