విద్య కనీసం ఇప్పుడైనా చెప్తారా మనం ఎక్కడికి వెళుతున్నాము సస్పెన్స్తో భరించలేక పోతున్నాం అనగానే హారిక కూడా గౌతమ్ వైపు చూస్తూ విజయ్ గురించి తెలిసిందా అని అనగానే గౌతమ్ వాళ్ళ వైపు చూస్తూ సీఐ పొద్దున్నే కాల్ చేసి ****ఏరియా దగ్గర బ్రిడ్జ్ పక్కన లోయ లాంటి ప్రదేశంలో ఒక యాక్సిడెంట్ అయిన కారు కనబడిందని ఎవరో పోలీస్ లకి కాల్ చేసాడంట అందుకే….. అంటూ చెప్పడం సగంలోనే ఆపేసాడు. వింటున్న ముగ్గురు లేడీస్ కి అసలు ఏమి అర్థం కాక అక్కడెక్కడో యాక్సిడెంట్ అయితే ఇక్కడి పోలీసులకి ఇన్ఫామ్ చేయడం ఏంటి అయినా దాంతో మనకు ఏంటి సంబంధం అంటూ విద్య ఆపకుండా వాగుతూనే ఉండడంతో అజయ్ కోపంగా కొద్దిసేపు నోరు మూసుకుని కూర్చో అని చెప్పగానే భయపడి టక్కున నోరు మూసుకుoది. కానీ ముగ్గురికి ఏదో తేడాగా ఉందని మాత్రం అర్థమైంది… నిజానికి జరిగింది ఏంటంటే పొద్దున్నే యాక్సిడెంట్ జరిగిన విషయాల్ని గుర్తించిన జనం పోలీసులకు ఇన్ఫోర్మ్ చేయడంతో…. పోలీసులు ఆ కార్ నెంబర్ను నోట్ చేసుకుని కేసు రిజిస్టర్ చేసి కారు డీటెయిల్స్ కంప్యూటర్ లో ఎంటర్ చేస్తుంటే విజయ్ పేరుతో ఆల్రెడీ అంతకుముందు రోజే మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ ఉండడంతో ఇక్కడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అతను గౌతమ్ కు కాల్ చేసి విషయం మొత్తం చెప్పి యాక్సిడెంట్ అయిన చోటుకి వెళ్తున్నట్టు చెప్పగానే మేం కూడా వచ్చేస్తాం అని చెప్పి ఆ విషయం అజయ్కి చెప్పి వెళ్దాం పద అనగానే
విజయ్ ఒక భర్త కథ 17
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 17