విజయ్ ఒక భర్త కథ 16
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 16 నేను మా టీం వెళ్లి సర్చ్ చేస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నీకు కాల్ చేస్తా అని చెప్పాడు అందుకే ఇంటికి వచ్చాము. అని గౌతం చెప్పడంతో హారికకు పక్కనే ఉన్న రమ్యకు అయోమయంగా ఉంది. అప్పటి దాకా ఎదురు చూడాలా? అని రమ్య అనడంతో గౌతమ్ తప్పదు అన్నట్టు తలూపాడు ఇక వెళ్ళి పడుకోండి ఇప్పటికే రాత్రి మూడు అయింది మళ్లీ పొద్దున్నే వెళ్లాలి నేను కూడా రేపు ఆఫీస్ కి సెలవు పెట్టాను అని చెప్పి హారిక వైపు చూడగా మీరు అజయ్ వెళ్లి ఆరూంలో పడుకోండి. మాకు నిద్ర రావడంలేదు అనగానే సరేఅని చెప్పి వెళ్లిపోయారు…
అజయ్ కనీసం రమ్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విద్య కూడా హారికను తీసుకొని రూంలోకి వెళ్లి తలుపువేసుకుంది. బయట హాల్లో రమ్య ఒక్కతే కూర్చుని ఆలోచిస్తుంది.. హారిక తనను అంత దెబ్బకొట్టిన... విద్య తను ఎన్ని మాటలుఅన్నా.. వాళ్లను అజయ్ ఒక్క మాట కూడా అనకపోవడంతో మెల్లమెల్లగా తను ఒంటరిది అయిపోతున్నాను అని అర్థమవుతుంది.. తన భర్త ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తుంటే అతనికి ఏం జరగకూడదు అని మనసులో గట్టిగా అనుకుంటూ ఏది ఏమైనా సరే రేపు ఎలాగైనా తన భర్తను కనిపెట్టి వీళ్ళందరికీ దూరంగా తీసుకొని వెళ్తా…. అని అనుకుంటూ వీళ్ళ చెప్పుడు మాటల వల్లే నా భర్త ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకోసారి ఎప్పుడూ ఆయన ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఇంతకు ముందే ఒకసారి కోపంతో హోటల్ కి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా మళ్లీ తనను చూడగానే మామూలు అయిపోయాడు.. విజయ్ కి తన మీద ఎంత కోపం ఉన్న తన మొహం చూస్తే అన్నీ