విజయ్ ఒక భర్త కథ 14
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 14 గౌతమ్ కి మీకు ఏమైనా చెయ్ అంటూ వాటర్ తాగడానికి కిచెన్ లోకి వెళ్లి వస్తూ ఉండగా విద్య ఒక్కసారిగా ఐడియా అని అరిచి ఏదో గుర్తొచ్చిన దానిలా ఫోన్ తీసుకొని ఏదో నెంబర్ కి కాల్ చేసింది ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోతే సరికి చూడగానే కాల్ చేయమని మెసేజ్ చేసింది.. హారిక విద్యతో ఏంటి ఐడియా అనగానే నా ఫ్రెండ్ వైజాగ్ లో టెలికాం కంపెనీలో చేస్తున్నాడు విజయ్ ఫోన్ను ట్రాక్ చేసి కనుక్కోవచ్చు కదా అని ….. కానీ బిజీగా ఉన్నట్టు ఉన్నాడు అందుకే చూడగానే కాల్ చేయమని మెసేజ్ పెట్టాను అంటూ… నాకు ఆకలేస్తుంది తినడానికి ఏమైనా చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి వంట చేయడంలో మునిగిపోయింది బయట హారిక ఇంకా విజయ్ గురించి ఆలోచిస్తూ అలాగే సోఫాలో నిద్ర పోయింది….
ఇక్కడ రమ్య… విద్య ఫోన్ పెట్టేగానే తన భర్త.. తన అత్త మామ.. కూడా ఏప్పుడు తనను ఎదిరించి మాట్లాడలేదు. తన చుట్టాల్లో కూడా తన మాటకు విలువ ఇస్తారు. తనంటే గౌరవిస్తారు .. అంతెందుకు విద్య మొగుడు అజయ్ కూడా ఇప్పటివరకు రమ్యతో గట్టిగా మాట్లాడాలంటే భయపడతాడు.. కానీ విద్య తనతో అలా మాట్లాడేసరికి రమ్య మొహం వాడిపోయింది… అలాగే ఆలోచిస్తూ ఫ్లైట్ అనౌన్స్ చేయగానే బాబుని తీసుకొని వెళ్లి ఫ్లైట్ లో కూర్చుంది…
విద్య వంట పూర్తి చేసి మళ్లీ ఒకసారి విల్సన్ కి కాల్ చేసి చూసింది కానీ నో రెస్పాన్స్… కొంపదీసి ఈ ప్లాన్ అంతా విల్సన్ దేనా అని అనుకుంటూ ఉండగా.. అజయ్ తొందర తొందరగా ఇంట్లోకి వస్తూ హాల్ లో సోఫాలో పడుకున్నా హారికను చూసి అప్పుడే కిచెన్ నుంచి వస్తున్న విద్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఏంటి?? అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా అని ఆత్రుతతో అడిగాడు.. దానికి విద్య ఇంకా ఏం తెలియలేదు అన్నట్టు తల అడ్డంగా పెట్టగానే పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? అన్నదానికి అప్పుడే ఇంట్లోకి వస్తున్న గౌతమ్ నేను ఆల్రెడీ అదే పనిమీద వెళ్లి వస్తున్నా.. అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి