వీడియో కాల్ 79
telugu stories kathalu novels వీడియో కాల్ 79 ఏంటి తొక్కలో నాయనమ్మ???, తాత నాయనమ్మ ఇద్దరు కలిసి ఆస్థి మొత్తాన్ని వాసు రమ్యల పేరు పైన రాస్తారా???, వాళ్ళకి ఎంత ధైర్యం?, అంటే నేనేమైపోవాలి????, నేను అంత పనికిరాకుండా పోయానా???, అస్సలు వాళ్ళు నన్ను అల గెలకక పోతే నేను ఈ రోజు ఇలా నీలాంబరిలాగా ప్రవర్తించేదాన్నే కాదు తెలుసా!!!, కానీ వాళ్ళు నన్ను ఆల్రెడీ ఎక్కడ గెలకకూడదో అక్కడ గెలికేసారు!!, చానా అవమానించారు!!!, దానికి తగిన శాస్తి ఏంటంటే..., ఆ ఆస్తిని మొత్తం నేనే కైవసం చేసుకోవడం...., అందుకు ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని చంపడానికి కుడా నేను వెనుకాడను!!!", అని కోపంగా చెప్పింది కావ్య.అప్పుడు రామ్మోహన్ కావ్యని కంట్రోల్ చేస్తూ..., "ఏయ్ కావ్య!!!, ష్!!!!!!, పిచ్చముండలాగా అరవడం ఆపుతావా???, ఇప్పుడు మనకి ఒక్క సమస్య ఉంది దానికి పరిష్కారం కుడా ఉంది..., ఓపికగా వింటావా ముందు?", అని అడిగాడు.కావ్య కొంచం సెట్