వెన్నెల రాత్రి 7
telugu stories kathalu novels books వెన్నెల రాత్రి 7 "నీవన్నీ విచిత్రాలే-సాయంకాలమయ్యేసరికి టింగురంగా అని అలంకరించుకోవటానికి మనమేమన్నా కుబేరులమూ? కూటికి లేనోళ్ళం- అందులోనూ అవన్నీ వేరేటైపు ఆడోళ్ళకి-సంసారోళ్ళకి కాదు- ఏం నేనలా లేకపోయినా పిల్లను కనలేదా- తల్లిని కాలేదా?" అంటూ లా పాయింట్లు లేవదీస్తుందిగానీ శుభ్రంగా తయారవదు.
తన భార్యచెప్పే ఆ లా పాయింట్లు తప్పని తెలుస్తుంటోంది కానీ వాటిని ఎలా బదులు చెప్పాలో తెలిసేది కాదు. అందువల్ల ఆమెకు చెప్పడం వల్ల లాభం లేదని తెలిశాక చెప్పడం మానేశాడు.
ఆ కారణం వల్లనే మానసంటే అతనికి గౌరవం. తన భార్య చేయకపోయినా తనుమాత్రం పొలంపనుల నుంచి వచ్చాక శుభ్రంగా స్నానం చేస్తాడు. ఉన్నంతలో నీట్ గా వున్నవి, ఉతికినవి కట్టుకుంటాడు. ఫ్రెష్ గా తయారై మానసవాళ్ళింటికి వస్తాడు.
బొమ్మలా తయారైన మానసను చూడడం, మాట్లాడడం అతనికి బావుంటుంది మాటల మధ్యలో తన ఆడదాన్ని తిడుతూ మనసును పొగుడుతుంటాడు.
"సరేలేమ్మా! మీరిద్దరూ మాట్లాడుతూ వుండండి. నేనెళ్ళి సీరియల్ అయినా చూస్తాను" అని కాంచనమాల లేచి ఇంట్లోకి వెళ్ళింది.
ఉండరా- నీకోసం అని దోసెలు పెట్టాను- ఇస్తాను" అని మానస లోపలికి వెళ్ళి ఓ విస్తరాకుతో వచ్చింది అందులో రెండు దోసెలు కారం వున్నాయి.
మంచి ఆకలిమీదున్నాడు కనుకే ఆవురావురుమంటూ దాన్నందుకున్నాడు బాబూ.
"ఇంతకీ ఏమంటున్నాడు మీ ఓనర్" మానస తనకు ఇష్టమైన టాపిక్ కి శ్రీకారం చుట్టింది.
"మా ఓనర్ కు ఏమండీ! పెట్టిపుట్టిన రకం- ఆ భగవంతుడు అన్నీ ఇచ్చాడు ఆయనకి - చదువు, అందం, ఆస్తి, మంచి మనసూ...." ఎక్కిళ్ళు పుట్టడంతో ఆగాడు.
ఆ మాటలకే ఆమె ముఖం వెలిగిపోయింది.
ఆమెకు సురేష్ వర్మంటే వయసు వచ్చినట్నుంచి యిష్టం. దానికీ కారణం వుంది. సురేష్ వర్మ శ్రీనివాసరావుకు అల్లుడు వరసతాడు. ఆయనది కులాంతర వివాహం. అతని భార్యకు సురేష్ వర్మ బంధువు. అలా మానసుకు బావ వరసవుతాడు. ఒకే ఊర్లో వుండడంవల్ల చాలా దగ్గర బంధువుల్లాగా మసలుకునేవారు.
సురేష్ వర్మకు సరితూగరుగానీ ఆస్తిపాస్తుల్లో వీళ్ళూ లెక్కలోకి వచ్చేవాళ్ళే. దాంతో సురేష్ వర్మకు మానసను ఇవ్వాలని శ్రీనివాసరావు పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.
సురేష్ వర్మ తల్లి అమసూయమ్మకు ఇష్టమేగానీ సురేష్ వర్మ మాత్రం పడనివ్వడంలేదు. ్తను ముఖంమీద గుద్దినట్టు మానసను చేసుకోవడం తనకిష్టంలేదని శ్రీనివాసరావుకు ఎప్పుడో చెప్పేశాడు. ఆయన ఇప్పటికీ ప్రయత్నిస్తున్నట్టు కూడా అతనికి తెలియదు.
ఈకారణంచేత ఆమె వయసుకురాగనే సురేష్ వర్మవైపు