వాన కురిసిన రాత్రి
telugu stories kathalu novels వాన కురిసిన రాత్రి వేదిక పై నున్న డీవిజనల్ మేనేజర్ వివిద బ్రాంచ్ లనుండి వచ్చిన మేనేజర్ల నుద్దేశించి ‘ ఈ నెలలో అన్నీ బ్రాంచ్ లకి ఇచ్చిన టార్గెట్ ని కేవలం ఇద్దరు రీచ్ కాగలిగారు, వారు సాయి శంకర్ మరియు కొత్తగా వచ్చిన శిరీష . ఆ ఇద్దరినీ మీ అందరి కరతాళ ద్వనుల మధ్య వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. గివ్ దెమ్ ఆ బిగ్ హాండ్ ‘అని చప్పట్లు కొడుతూ అనగానే ఆ కాన్ఫరెన్స్ హాల్ లో కూర్చున్న ఇద్దరు వచ్చి పూలబోకే గిఫ్ట్ అందుకున్నారు.సాయంత్రం కాన్ఫరెన్స్ అయిపోగానే తిరిగివెళ్లడానికి బస్ కోసం వెళుతుంటే వెంట నున్న విశాలాక్షి మేడమ్, ఆమె బ్రాంచ్ ని దాటి వెళ్ళే, సాయి శంకర్ కారులో వెళ్ళమంటూ బలవంతాన పరిచయం చేసి శిరీష వద్దంటున్నా , కూర్చోబెట్టింది.నిశ్శబ్దం భయంకరంగా అనిపించడం తో డెక్ ఆన్ చేశాడు సాయి .’ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే ...పక్క నున్న వాడిమీద నీకు దయరాదటే....;పాట వస్తుంటే శిరీష తల కిటికీ వైపు తిప్పి నవ్వుకుంది. ఏమనుకున్నాడో మార్చాడు .‘మనసున మెదిలే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు .....పెదవి కదిపితేమనసులోని మాట తెలియుననీ మానేవూ. .తలను