వంశాచారం 53
naa telugu kathalu వంశాచారం 53 అపార సంపద వెల కట్టలేని వజ్రాలు మణులు బంగారు ఆభరణాలు అంతకు మించి అతిలోక సౌందర్యాన్ని కలిగిన మాలిని దేవి మరియు ఆమె ఒక్కగానొక్క కొడుకు వున్న ఆ భవనం నీళ్ల అడుగులో మొసళ్ల మధ్య ఉండిపోవడం ఆ చుట్టుపక్కల గ్రామస్థులను కలచివేసింది. మాలిని దేవి అందం చందం ఎరిగిన ఆ చుట్టూ పక్కల ప్రజల మనస్సులో మాత్రం మాలిని దేవి ఎప్పటికి మరిచిపోలేని తియ్యటి జ్ఞాపకం గా మిగిలిపోయింది.కొద్దీ సంవత్సరాల తరువాత ఉత్తర భారతదేశం చలి ప్రాంతపు కొండల మధ్యనున్న ఒక పట్టణం లో ని అతి పెద్ద భవనానికి ముందు,చాలా మంది ప్రజలు బారులు తీరి ఆ ఇంటి యజమాని కోసం వేచి చూస్తున్నారు. ఆ రోజు ఆ ఇంటి దంపతుల వివాహ దినోత్సవం, ఆ సందర్బంగా పేదవారికి దాన ధర్మాలు చెయ్యడం వారి ఆనవాయితీ. ఈ ఆదర్శ దంపతులు గొప్ప సంపన్నులు మరియు ఊరిలో అందరి తలలో నాలుకలా ఉంటూ