త్రిపుర సుందరి 7
త్రిపుర సుందరి 7 అనసూయ పగ ఈరోజుది కాదు దాదాపు పదిహేనేళ్ల క్రితంది. అప్పటినుంచి కుటుంబం మొత్తాన్ని ఎలా చల్లా చదురు చేయాలా అని ఆలోచిస్తూనే ఉంది. కానీ ఇప్పటికి వాళ్ళ కుటుంబం లో పాములు కదపటానికి ఒకడు దొరికాడు. వలలో వేసుకుంది. ఇప్పుడు ఎలా ఆడమంటే అలా ఆడేలాగా ఉన్నాడు ఆది కేశవ. ఎంతటి బలవంతుడనైనా లొంగదీసుకునేది ప్రేమ ఒక్కటే. అందువల్లనే ఆది కేశవ చాలా సులువుగా అనసూయ మాయలో పడిపోయాడు.
వాసుదేవరావు కుటుంబం లో ప్రవేశించడానికి సరి ఐన రోజు రానే వచ్చింది. త్రిపుర సుందరికి మహిళా సంరక్షణ మంత్రిగా నియమించారు ఢిల్లీ లో పెద్దాయన. హోమ్ మినిస్ట్రీ వస్తుందని ఆశపడ్డ వాసుదేవరావు పోనిలే ఇది ఐన వచ్చింది తరువాత సారి తప్పక హోమ్ కోసం ప్రయత్నించాలని అనుకున్నాడు. ఇల్లంతా చుట్టాలు పార్టీ నాయకులతో చాలా హడావిడిగా ఉంది. దాదాపు 10 న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ అందరు అక్కడే ఉన్నారు లైవ్ చూపిస్తున్నారు. అదే సమయం లో గేట్ లోంచి ఒక కార్ లోపలి వస్తోంది. టీవీ వాళ్ళు vip లని వీడియో తీసేపనిలో కార్ వైపు కూడా కెమెరాలు పెట్టేరు. కార్ లో నుంచి ఎవరు ఊహించని విధంగా మేడలో దండలతో దిగారు అనసూయ ఆది కేశవులు పెళ్లి చేసుకుని. వాళ్ళని చూడగానే మొత్తం జనాలు అందరు నోట్లో గిలక్కాయ పడ్డట్టు చూస్తూ ఉండిపోయారు. వాసుదేవరావు సుందరి లకు ఐతే కాళ్ళ కింద భూమి కంపించింది. స్వాతి మనోహర్ విచిత్రం గా ఆది దంపతులని చూస్తూ వేళ్ళ మొహాలు వేళ్ళు చూసుకుంటున్నారు ఆశ్చర్యంగా. మీడియా వాళ్ళు బలే దొరికింది బ్రేకింగ్ న్యూస్ అన్నట్టుగా కెమెరాలు అన్ని వాళ్ళ వైపునే పెట్టేరు.
సుందరికి ఎక్కడా లేనంత కోపం వచ్చి ఆది దగ్గరకి వెళ్లి చెయ్ ఎట్టి కొట్టబోయింది వెంటనే రావు సుందరి చెయ్ పట్టుకుని ఆపేసేడు అలాగే సుందరిని ఇంట్లోకి తన రూమ్ లోకి తీసుకుపోయాడు.
రావు: సుందరి తొందరపడవద్దు అసలు ఎం జరుగుతోందో నాకు అర్ధం కావట్లేదు.
సుందరి: బోరున ఏడవటం మొదలుపెట్టింది, ఏంటండీ ఇది వాడేంటి వాడి వయసేంటి పెళ్లి ఏంటి. అసలు ఇలాంటి పని చేయాలనీ ఎలా అనిపించింది అంది వాడికి. ఆ పిల్లని చుస్తే వీడి కన్నా చాలా పెద్ద అమ్మాయి లాగ ఉంది. అసలు ఒక్క మాట కూడా లేదు.
రావు: తొందరపడకు ఏడవకు, ఎదో జరిగింది