తీరెను కోరిక తీయతీయగా 2
telugu stories kathalu novels తీరెను కోరిక తీయతీయగా 2 అలంకరించుకుని బయటకొచ్చిన రాధమ్మ ఎదురుగా కనిపిస్తున్న భర్తను చూసి ఆగిపోయింది బిడియంగా. తననే కన్నార్పకుండా చూస్తున్న భర్తను చూస్తే ఎందుకో సిగ్గు ముంచుకొచ్చింది. మెల్లగా కళ్లెత్తి అతడివైపు చూసింది. అతడికళ్ళలో కనిపిస్తున్న ప్రశంసను చూసి ఆశ్చర్యపోయింది.
ప్రౌడ అందాలతో విరాజిల్లుతున్న అర్ధాంగి కి దీటుగా తెల్లనిలాల్చీ పైజమాలలో వయసుమళ్ళిన మన్మధుడల్లే వెలిగిపోతున్నాడు ముద్దుకృష్ణ. ‘తల కాస్త నెరిసిందికాని, నామొగుడిప్పటికీ నలకూబరుడే’ మురిపెంగా అనుకుంది రాధమ్మ.
“ఇవాళ నువ్వు చాలా బాగున్నావోయ్!’’ ఏనాడూ భర్త నోటమ్మట వినబడని ప్రశంస వినగానే అపనమ్మకంతో చూశాయి రాధమ్మకళ్ళు.
“మీ...మీరు కూడా ఈ డ్రస్‌లో చాలా...బా...గున్నారు...’’ అప్పుడే మాటలు పలకడం నేర్చుకుంటున్న పసిపాలా తడబడింది రాధమ్మ.
ఆశ్చర్యంగా చూశాడు ముద్దుకృష్ణ . “అమ్మో! మా ఆవిడకి మొగుడిని మెచ్చుకోవడం కూడా వచ్చే!’’ అన్నాడు చిలిపిగా నవ్వుతూ.
అతడికి రెట్టింపు ఆశ్చర్యపోవడం రాధమ్మ వంతైంది. “ మరి మీరు కూడా పెళ్లైన ఇన్నాళ్లకి భార్యని మెచ్చుకుంటున్నారుగా...’’ గడుసుగా అంది రాధమ్మ.
“ భార్య అందాన్ని మెచ్చుకోవాలని ఏభర్తకి ఉండదు చెప్పు! కాని, దగ్గరకొస్తేనే ముద్దబంతిలా ముడుచుకు పోతున్న ఈ అందాలభరిణని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియలేదిన్నాళ్ళూ...’’ కొంటెగా అన్నాడు ముద్దుకృష్ణ.
“బాగుంది మీవరస! ఆడది ఎప్పుడూ సంకోచంతో ముడుచుకుపోతుంది. చొరవచేసి ఆబిడియాన్ని పోగొట్టవలసింది మగవాడే...’’ తనకంత చేరువగా వచ్చిన భర్త దగ్గర