telugu stories kathalu వెన్నెల రాత్రి 1 అక్కడెక్కడో దూరంగా వున్న లోకాల నుంచి ఆకాశపుటొడ్డుకు కొట్టుకొచ్చిన గవ్వలా వున్నాడు చంద్రుడు. ఎండకు భయపడి అప్పటి వరకు కాలు బయటపెట్టని గాలి అప్పుడే షికారుకు బయల్దేరినట్టు చల్లగా తగుల్తోంది. మల్లెపూలు వేసుకున్న పైటను ఎవరో ఆకతాయి లాగేసినట్టు ఆ ప్రదేశమంతా సువాసనలు చుట్టుమడుతున్నాయి. అక్కడక్కడా విసిరేసినట్టున్న పెంకుటిళ్లు భూదేవి తన పాదాలకు రాసుకున్న గోరింటాకు లతల్లా వున్నాయి. ఇళ్లమధ్య వున్న రహదారి వెన్నెల్లో వెండిపట్టీలా మెరుస్తోంది. సురేష్ వర్మ మెల్లగా ఆ… Read More »