సౌందర్య గిరీ 43
naa telugu kathalu సౌందర్య గిరీ 43 (రాబోవు కాలం లో ఎన్నో చాలంజేస్ ని ఎదుర్కోవాలి అన్న సంగతి తెలిసినా .....దాని తర్వాత ఉండబోయే జీవితం బెడ్ ఆఫ్ రోసేస్ అని తెలిసి కోటి ఆశలతో ఫ్లయిట్ ఎక్కారు.....)
హైదరాబాద్ కి బయలుదేరే ముందు కూడా సౌందర్య గిరి లు తమ ఫాం హౌజ్ లో ఆ రోజు ఉదయం కూడా ముద్దు ముచ్చట్లు ఆడుకున్నారు...ఒకరి నొకరు చూసుకుంటూ ...కళ్ళలో కళ్ళు పెట్టి ప్రేమిస్తూ...బాహు బంధనాల్లో కరిగిపోతూ... అన్యోన్యమైన ప్రేమ జంట గా మేదిలారు...ఒకరి చేయి ఒకరు విడవకుండా చూపుల వలలు వేసుకుంటూ స్పృశించుకుంటు...చిలక గోరింకల్లా ఎగురుకుంటూ ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నారు...
కొన్ని రోజులు ఎవరి పనుల్లో వారు బిజీ గా గడిపారు ....రోజంతా పనుల్లో నిమగమమైనాకూడా రాత్రి ఇంటికి చేరగానే గువ్వపిట్టల్లా ఒకరిలో ఒకరు ఒదిగి పోయి ప్రేమ గా ఉండేవారు...ఈ లివింగ్ రెలేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఒక 2-3 నెలలు హాయిగా గడిపారు ...అంతకంతకూ వారిరువురికి ప్రేమ కొల్లలు అయింది తప్ప తగ్గలేదు ....ఈ బంధాన్ని ఇంక ముందుకు