సెక్రటరీ Secretary by Yeddanapudi
అందం, పరువం, పొగరుమోత్తనంగా కనిపించే ఆత్మాభిమానం వున్న ఆడపిల్ల జయంతి.
హుందా, ఠీవి, డబ్బు, పదిమందిలో పలుకుబడి వుండి, ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖరం.
పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి.
అమాయకత్వాన్నీ, అంతస్తుల భేదాన్నీ అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం.
అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు.
మనసు లోపల పొరల్లోని యిష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మధించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచనా తెలియంది కాదు!
కానీ ఎన్నిసార్లు చదివినా, తిరిగి చదవాలనిపించే ‘సెక్రటరీ’ అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం…
చదవండి, మీకే తెలుస్తుంది!!
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి