సంగమము
telugu stories kathalu novels సంగమము ఆ సాయంత్రం నేను సోమేశు ఇంటి డాబామీదికి వెళ్ళేసరికి శ్యామసుందరం నలుగురు యువకుల మధ్య కూర్చుని ఏదో చెప్తున్నాడు. అతనితో నాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి పేపరు పట్టుకుని, వాళ్ళకు కాస్త దూరంగా ఓ పెద్దాయన పక్కన కూర్చుని వాళ్ళ మాటలు వింటున్నాను. శ్యామసుందరం చెప్తున్నాడు.
"మీరందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఆనాటి మొదటి రాత్రి అనుభవం. ఈనాటికి ఎన్నో సోర్సెస్ నుండి మీకు తెలిసే ఉంటాయి, ఈ విషయం గురించి" అలా చెప్తుంటే నలుగురూ అతనికి దగ్గరగా జరిగారు.
"ఆడపిల్ల ఆత్రంగా ఎదురుచూసే సంఘటనల్లో మొదటిది తన మెడలో మంగళసూత్రం పడటం. వరుడు తన మెడలో మంగళసూత్రం కడుతూ ఉంటే, వధువు ఎంతగా మురిసిపోతుందో వర్ణనాతీతం. లోకాన్ని జయించినంత గర్వాతిశయం. ఈనాటికీ ఆ సంఘటన గుర్తుకు రాగానే, వధువు బుగ్గలు ఎంత రాగరంజితమవుతాయో, అనుభవించిన ఆమెకే తెలుస్తుంది.
ఇక రెండవది మొదటి రాత్రి.
ఈ సన్నివేశం గురించి వరుడు ఎంతగా ఊహల్లో విహరిస్తాడో వధువూ అంతే. ఒకరి గురించి, మరొకరు ఎన్నో ఊహలు చేస్తారు. వాళ్ళ ఊహల ననుసరించి ప్లాన్లు వేసుకుంటారు. నేనూ అలాగే ప్లాన్ చేసుకున్నాను.
మొదటిరాత్రి గురించి ఆడపిల్లకి బిడియం, అంతకన్నా భయం ఉంటాయి. వాటిని పోగొట్టడం కోసం వరుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఆమె శరీరమెంత సున్నితమో, అంతకన్నా పది రెట్లు ఆమె మనసు సున్నితం, శృంగారమంటే శారీరకంగా ఏకం కావడం కాదు. మానసికంగా దగ్గరవడం, శృంగారాన్ని ఆమె నుండి ‘డిమాండు' చేయడం కాదు. ఆమె మనసును వరుడు తన వైపు తిప్పుకోవడం.
ఆమె పాల గ్లాసుతో అప్పుడే పాల సముద్రం లోంచి ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మిలా అలంకృతమై పడకగదిలోకి ప్రవేశిస్తుంది. మధురమైన అగరోత్తుల పరిమళాల మధ్య ఆమె సిగ్గు పడుతూ, భర్తవేపు చూడాలా, మానాలా అన్నట్టుగా ఓరచూపులతో పూలపాన్పు దగ్గరకి వస్తుంది. ఆ సమయానికి