రావోయి మా ఇంటికి 9
అతను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని లాగాడు. కందిరీగలు కుట్టినట్లు బాధతో కమిలిపోయాను. అయిదడుగులా అయిదంగుళాలు మనిషిని నాలుగు అడుగుల పెట్టెలో పెట్టి బయటనుంచి చీలలతో బిగించినట్లు ముడుచుకు పోయాను.
"ఏమిటలా బిగుసుకుపోతావ్! ఇలా అయితే అయినట్లే -" అన్నాడు. అప్పటికే నిస్సత్తువ నాలోని చైతన్యాన్నంతటినీ హత్య చేసింది. కాళ్ళూ చేతులూ వశం తప్పాయి. ప్లాస్టిక్ తో చేసినట్లు బిగదీసుకుపోయాయి. కళ్ళు వాటంతటవే మూసుకుపోతున్నాయి. శరీరం ప్రాణాన్ని కోల్పోయినట్లు చచ్చుబడిపోయింది.
అప్పటికే ఆయన నాలో కలిసిపోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. కానీ నా స్థితి అందుకు వీలు కల్పించడం లేదు. శరీరం గట్టిగా ఇనుములా తయారయింది. మెత్తదనం ఎక్కడో మాయమయి పోయింది.
గుండెల్లో మంట మరింత ఎక్కువైంది నాకు. శరీరాన్ని వుండలా చుట్టి ముళ్ళ కంపమీద గిరవాటేసినట్లు కళ్ళలోంచి నీళ్ళు చిప్పిల్లు తున్నాయి.
కనురెప్పలు మూతలుపడ్డాయి. ఆ బాధను మరిచిపోవడానికి నేనూ, మనోహర్ గడిపిన క్షణాలను బలవంతంగా గుర్తుకు తెచ్చుకున్నాను.
మొదట - మనోహర్ డాబామీద వీడియో సినిమా చూడడానికి వెళ్లినప్పుడు అతని చేతి నా ఎదకు తగలడం - సుగుణ వాళ్ళింట్లో మనోహర్ గట్టిగా కౌగలించుకుని, బుగ్గలపై సుతారముగా ముద్దు పెట్టడం, వీధిలో వెళుతూ నన్ను చూసి కొంటెగా కన్ను గీటడం, గొబ్బీలు తట్టడానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి, శివాలయం దగ్గర కలుసుకోవడం, అన్నీ పుప్పొడిమీద అచ్చొత్తిన చిత్రాల్లా కన్పిస్తున్నాయి. ఏదో హాయి శరీరానికి రిలాక్స్ ని కలగజేసింది. జీవ కణాలన్నీ ఆనందాన్ని పీల్చుకుని సాగాయి. మనసు రంగుల తుఫానులో చిక్కుకున్న గాలిపటమే అయింది. రక్తం జ్ఞాపకాలతో మరింత