రావోయి మా ఇంటికి 23
"ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసేవాడ్ని మాత్రం కట్టుకోకూడదు. భర్త దూరంగా వుండే స్త్రీ బతుకు చక్కెర ఫ్యాక్టరీలాంటిది. సగంరోజులు క్రష్షింగ్ వుంటే, మరి సగంరోజులు తాళం తగిలించేస్తారు" అనేది.
ఆమెకి ఇంకా పిల్లల్లేరు. బంధువుల్లో ఆమెకొక్క దానికే ఓ నాలుగురోజుల పాటు పరాయి ఇంట్లో వుండే వెసులుబాటు వుండడం వల్ల ఆమెను అడిగారు
సరేనని ఒప్పుకుంది సరోజ.
మిగిలిన వాళ్ళంతా వచ్చేశారు.
పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ, సరోజ మిగిలారు.
ఉదయం లేవగానే సుధాకర్ శుభ్రంగా డ్రెస్ అప్ అయి ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు. సరోజ, నవనీతా కలిసి వంట చేస్తూ కబుర్లలోకి దిగేవారు.
సాయంకాలం ఆరుగంటలకి అతను తిరిగి వచ్చేవాడు. ముగ్గురూ కలిసి కాఫీలు తాగుతూ, అవీ ఇవీ లోకాభి రామాయణం మాట్లాడుకునే వాళ్ళు.
రాత్రి తొమ్మిదింటికి కొత్త జంట తమ గదిలోకి వెళ్ళేవారు. హాల్లో ఒంటరిగా మిగిలిపోయేది సరోజ.
రెండు మూడు రోజులు నిద్రపోయింది గానీ ఆ తఃరువాత ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదామెకి.
గదిలో జరిగేదంతా ఊహించుకునేది. నవనీత, సుధాకర్ కలిసి అనుభవించే స్వర్గసుఖాలన్నీ కళ్ళముందు కదలాడేవి. దాంతో ఒక రకమైన ఉద్రేకానికి లోనయ్యేది శరీరం మీదున్న బట్టలే బరువుగా తోచేవి. శరీరమంతా ఉద్రేకానికి లోనయ్యేది శరీరం మీదున్న బట్టలే బరువుగా తోచేవి. శరీరమంతా ఆరాటంతో కదిలిపోయేది సుఖం కోసం అవయవాలన్నీ నోళ్ళు తెరుచుకునేవి.
బయట యిలా ఆమె అవస్థ పడుతుంటే లోపల గదిలో అతను అందుకు అంగీకరించమని అర్ధించడం, నవనీత రిజెక్ట్ చేయడం జరుగుతుండేది.
ఇలా కొన్నిరోజులు గడిచాయి.