రావోయి మా ఇంటికి 20
ఆమె పెదవులు బాధనంతా వ్యక్తం చేయడానికి ఏవో శభ్దాలను చేస్తున్నాయి. ఈ అవస్థ అంతా ఎప్పుడు కలుగుతుందో తెలిసిన అతను ఆమెను అనునయిస్తూ "మొదటిసారి ఇదంతా తప్పదు" అనిఅంటూనే వున్నాడు.
ఆమె బాధనంతా పళ్ళమధ్య బిగించింది.
కళ్ళల్లో నీరు ఊరడం కూడా తెలుస్తూనే వుంది.
మరో అయిదు నిమిషాలకి గ్రీష్మంలా శీతల పావనం తాకినట్లు ఆమె రిలీఫ్ గా ఫీలయింది.
అతను ఆమె పక్కన వున్నాడు.
"అద్భుతం - ఏం కావాలన్నా కోరుకో ఇస్తాను" అన్నాడు ఆమె వైపు చూస్తూ.
అంతవరకు ఎంతో అద్భుతంగా నటించిన ఆమె, అదంతా ఆ క్షణంలో ఒక్కసారి మరిచిపోయి "వంద రూపాయలు ఎక్కువివ్వు-" అంది.
అంతే! అతను ఫ్రీజ్ అయిపోయాడు.
తన తప్పు తెలిసిన ఆమె నాలుక కారుచుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది"
లాలస చెప్పిందంతా విని నవ్వుతోంది సుజన.
"పాపం గురుడు షాకైపోయి వుంటాడు. అంతవరకు తను పెళ్ళి చేసుకుంది కన్య అని మురిసిపోతున్న అతను, ఆమె చివరి మాటలు విని ఎలా అయిపోయి వుంటాడో ఊహిస్తుంటే నవ్వొస్తోంది"