రాజ్య సింహాసనం 46
naa telugu kathalu రాజ్య సింహాసనం 46 ఆ మాట వినగానే ఆవిడ అలాగే అన్నట్టు తల ఊపి ఆ మందిరంలో ఎవరికి కనిపించకుండా దాక్కున్నది.రమణయ్య మిగతా వాళ్లతో చేయాల్సిన పనులు గురించి చర్చించుకుంటున్నారు.
అప్పుడే చేతిలో మదిరపాత్రతో వయ్యారంగా తన నడుముని ఊపుకుంటూ జలజ మందిరంలోకి అడుగుపెట్టింది.
జలజ లోపలికి రావడం గమనించిన రమణయ్య తన కంటి సైగతోనే తన వాళ్ళను మెదలకుండా ఉండమని సైగ చేసాడు.
జలజ వయ్యారంగా నడుచుకుంటూ రమణయ్య దగ్గరకు వచ్చి అభివాదం చేసింది.
రమణయ్య ఆమె వైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ, “ఎవరు….ఇక్కడకు ఎందుకు వచ్చావు,” అనడిగాడు.
జలజ : నా పేరు జలజ అండీ….నేను విక్రమవర్మ రాణిగారి పద్మిని దేవి గారి ప్రియ సఖిని….రాజు గారు నన్ను మీ సపర్యల కోసం ప్రత్యేకంగా నియమించారు….(అంటూ తన చేతిలో ఉన్న మదిర పాత్రని అక్కడ పక్కనే ఉన్న బల్ల మీద పెట్టింది.)
అది గమనించిన రమణయ్య ఇంతకు ముందు తాను మదిరపాత్ర మార్చడానికి నియమించిన ఆమె వైపు చూసి సైగ చేసాడు.
రమణయ్య చేసిన సైగని అర్ధం చేసుకున్న ఆమె అలాగే అన్నట్టు సైగ చేస్తూ ఇంతకు ముందే సిధ్ధం చేసుకున్న మదిర పాత్రని జలజ చూడకుండా మార్చేసింది.
ఆమె మదిర పాత్ర మార్చడం గమనించిన రమణయ్య ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని జలజ వైపు చూస్తూ….
రమణయ్య : మా మీద అంత శ్రధ్ధ చూపిస్తున్నందుకు మీ మహారాజు గారికి మేము చాలా రుణపడి ఉంటాము జలజా… ఇక్కడ మాకు చాలా సౌకర్యంగా ఉన్నది….నీకు శ్రమ కలిగించడం నాకు ఇష్టం లేదు….నువ్వు వెళ్ళవచ్చు…..
జలజ : లేదు రమణయ్య గారు….నేను మిమ్మల్ని వదిలివెళ్ళిన విషయం మా మహారాజు గారికి తెలిసిందంటే నా తల తీస్తారు….మీరు నా సేవలను వినియోగించుకోవలసిందే…..
దాంతో రమణయ్య తన పరివారం వైపు చూసి ఇక వెళ్ళమన్నట్టు సైగ చేసాడు.
అందరూ అక్కడ నుండి వెళ్ళిపోక రమణయ్య తన ఆసనంలో నుండి పైకి లేచి పడక గది లోకి వెళ్లాడు.
మదిరపాత్ర మారిందని గమనించని జలజ దాని పట్టుకుని రమణయ్య వెనకాలే కూడా వెళ్ళింది.
రమణయ్య తల్పం మీద కూర్చుంటూ జలజ వైపు చూస్తూ….
రమణయ్య : ఇప్పుడు చెప్పు జలజా….ఏంటి విశేషాలు…..
జలజ : మా రాజ్యంలో విశేషాలు ఏముంటాయి రమణయ్య గారు…మీదంటే మహా సామ్రాజ్యం మీరు చెప్పండి… (అంటూ పక్కనే ఉన్న గ్లాసు తీసుకుని పాత్రలో ఉన్న మదిరని పోసి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి తన చేతిలోని మదిర గ్లాసుని రమణయ్య నోటికి అందిస్తూ) ఇంతకు నేను బాగా సేవ చేస్తున్నానో చెప్పలేదు….(అంటూ చిలిపిగా రమణయ్య వైపు చూస్తున్నది.)
జలజ చూపులో భావాలు రమణయ్యకు బాగా అర్ధమయ్యి అతను కూడా జలజ చేతిని పట్టుకుని మదిరను ఒక గుక్క తాగి...ఇంకో చేత్తో జలజ నడుముని పట్టుకుని