రాజ్య సింహాసనం 27
రాజ్య సింహాసనం 27 కొద్దిసేపు వాళ్ళందరూ మాట్లాడుకున్న తరువాత రత్నసింహుడు, కళావతి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
రమణయ్య మత్రం గంభీరంగా ఉండటం చూసి ఆదిత్యసింహుడు అతని వైపు చూస్తూ….
ఆదిత్యసింహుడు : ఏమయింది రమణయ్య గారూ….అంత గంభీరంగా ఉన్నారు….
రమణయ్య : ఏం లేదు ప్రభూ….మీరు ప్రభావతి గారితో ఏం సంభాషించారు....రాకుమారి ఎలా ఒప్పుకున్నది…
దాంతో ఆదిత్యసింహుడు జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు.
రమణయ్య : (అంతా విన్న తరువాత) సమస్య పైకి మామూలుగా కనిపిస్తున్నా….అంతర్గతంగా చాలా భీకరంగా ఉన్నది ప్రభూ…..
ఆదిత్యసింహుడు : అవును….నాక్కూడా అదే అర్ధం కావడం లేదు….ప్రస్తుతానికి ఇంతకు మించిన పరిష్కారం కూడా నాకు తోచడం లేదు…..
రమణయ్య : ముందు రాకుమారిని నిలువరిస్తే…మన రాజ్యానికి వెళ్ళిన తరువాత శాశ్వత పరిష్కారం అలోచించొచ్చు…
ఆదిత్యసింహుడు : నాక్కుడా అంతే అనిపిస్తున్నది…(అంటూ అతని వైపు చూస్తూ) ఇంతకు మీరు ఇందాక మధ్యలో ఎక్కడకు వెళ్ళారు….
రమణయ్య : (దీర్ఘంగా శ్వాస పీలుస్తూ) ఇదివరకు మీరు, రాకుమారి మాట్లాడుకుంటున్న మాటలు ఒక గూఢచారి విన్నాడు…(అంటూ తన దుస్తుల్లో నుండి ఒక వస్తువుని తీసి ఆదిత్యసింహుడికి ఇస్తూ) దీనిని గుర్తించారా….
ఆదిత్యసింహుడు : (ఆ వస్తువుని తీసుకుని పరీక్షగా చూస్తూ) అవును….ఇది…..
రమణయ్య : మీరు ఊహించినది సబబే ప్రభూ….ఆ గూఢచారి మీ అన్నగారు వీరసింహుడి తాలూకా….
ఆదిత్యసింహుడు : మరి అతన్ని ఏం చేసారు….మేము మాట్లాడుకున్నవి అన్నీ వినేసాడు….
రమణయ్య : మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభూ….కంటిని కాపాడుకోమని కనురెప్పకు చెప్పాలా….నేను ఇంతకు ముందే అతన్ని చంపేసాను….శవం కూడా ఆచూకీ దొరకదు