రాజ్య సింహాసనం 24
రాజ్య సింహాసనం 24 రాజ్య సింహాసనం 24 కళావతి : నువ్వు నీ అన్నగారి దగ్గరకు వెళ్తావని నాకు ఎలా తెలుస్తుంది కుమారా…అయినా ఆ లేఖలో నీ రాజముద్ర లేదు….దానికి తోడు ఆ లేఖ తెచ్చిన దూత కూడా వీరసింహుడి దూత….దానితో నేను ఆ లేఖ వీరసింహుడి వద్ద నుండి వచ్చింది అనుకున్నాను….
ఆదిత్యసింహుడు : అక్కడే తప్పిదం జరిగిందమ్మా….నేను నా రాజముద్ర వేసాను అనుకుని విరించి చూసుకోకుండా ఆ లేఖను మీకు పంపించాడు…..
రత్నసింహుడు : మరి ఇప్పుడు ఏం చేద్దాం కుమారా…మన ఆచారం ప్రభావతికి వీరసింహుడి రాజఖడ్గంతో శాస్త్రోక్తకంగా వివాహం జరిగిపోయింది…
కళావతి : ఇంకొక్క సందేహం కుమారా…..
ఆదిత్యసింహుడు : ఏంటమ్మా అది….
కళావతి : మరి నిన్ను ఇష్టపడిన ప్రభావతి వీరసింహుడితో వివాహానికి ఎలా ఒప్పుకున్నది….
ఆదిత్యసింహుడు : అదేనమ్మా నాకూ అర్ధం కావడం లేదు….అది తెలుసుకుందామనే నేను ప్రభావతిని కలవాలనుకుంటున్నాను…..
కళావతి : సరె….నువ్వు కంగారు పడకు….నేను ప్రభావతిని ఇక్కడకు రమ్మని కబురు పంపుతాను…ఆమె ఇక్కడకు వచ్చిన తరువాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాము….కాని…..
ఆదిత్యసింహుడు : మరలా ఏంటమ్మా…..
కళావతి : ఏది ఏమైనా ప్రభావతికి మీ అన్నగారు వీరసింహుడితో వివాహం జరిగిపోయింది….కాబట్టి నువ్వు ఆమెను వదిన స్థానంలోనే చూడాలి…..
అదిత్యసింహుడు : అమ్మా….అదీ…..
కళావతి : ఇక చర్చించేందుకు ఏం లేదు కుమారా…వివాహం అయిపోయింది…దాన్ని మనం ఏమీ చేయలేం… ఇప్పుడు మనం ఈ ప్రయత్నాలు అన్నీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడమే…..
ఆదిత్యసింహుడు : మీరు అలా సమస్యకు