రాజ్య సింహాసనం 22 లేఖలో : ప్రియమైన తల్లిగారికి పాదాభివందనం చేస్తూ రాయునది…నేను ఇక్కడ కామపుర రాజ్యాధినేత యశోవర్ధనుడి కుమార్తె యువరాణి ప్రభావతిని చూడటం జరిగింది….ఆమెను చూడగానే వివాహం చేసుకోదలిచాను….అందుకు మీ అనుమతి కోసం ఈ లేఖను పంపించుచున్నాను….రెండు మూడు దినములలో నేను రాజ్యానికి తిరిగివస్తాను…అంతలో మీరు కామపురరాజు యశోవర్ధనుడితో సంప్రదించి మీరు వివాహ ముహూర్తము నిర్ణయించకోరుతున్నాను….ఆ లేఖ చదవగానే వీరసింహుడు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు…పైగా కన్యను కూడా ఎంచుకున్నందుకు కళావతి చాలా సంతోషపడిపోయింది.దాంతో కళావతి వెంటనే తగిన రాజలాంచనాలతో తన దూతను పంపించి వివాహ ముహూర్తాన్ని నిర్ణయించింది.ఇదంతా జరుగుతుండగా వీరసింహుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు.పెళ్ళిప్రస్తావనలు తెలియని వీరసింహుడు రాజభవనం అంతా కోలాహలంగా….అలంకరణలతో నిండిపోయే సరికి ఏదో ఉత్సవం జరుగుతున్నదనుకుని తన మందిరానికి వెళ్ళాడు.అక్కడ తన అంతరంగీకుడు దీలీపుడిని పిలిపించుకుని….వీరసింహుడు : ఏం జరుగుతుంది….ఏదైనా ఉత్సవ సన్నాహాలు చేస్తున్నారా….దిలీపుడు : కాదు యువరాజా….మహారాణీ కళావతి గారు మీకు వివాహం చేయ నిశ్చయించారు….ముహూర్తం కూడా నిర్ణయించారు….వీరసింహుడు : నాకు తెలియకుండా నా వివాహమా….ఇప్పుడే వెళ్ళి మా తల్లి గారిని అడుగుతాను….(అంటూ అక్కడ నుండి మహారాణీ కళావతి దగ్గరకు వెళ్లబోయాడు.)కాని దిలీపుడు వెంటనే వీరసింహుడి ముందు ఒక చిత్రపటాన్ని పెట్టి….దీలీపుడు : మీరు మీ మందిరానికి రాగానే మీకు ఈ చిత్రపటాన్ని చూపించమన్నారు….ఆ పటం మీద బొమ్మ కనిపించకుండా దాని మీద పట్టు గుడ్డ పరిచి ఉన్నది.వీరసింహుడు : ఏమున్నది ఆ చిత్రపటంలో….దిలీపుడు : మీరు చేసుకోబోయే కామపుర యువరాణి చిత్రపటం…ఈమెను చూసిన తరువాత
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి