రాజ్య సింహాసనం 12
రాజ్య సింహాసనం 12 అది విన్న ఆదిత్యసింహుడు చిన్నగా నవ్వి తన ఆసనంలో కూర్చుంటూ, “ఆ విషయం నాకు తెలుసు మంత్రిగారు…. కాకపోతే మీ గూఢచారులు తెచ్చిన సమాచారంలో మీకు తెలియని విషయం ఇంకోటి ఉన్నది,” అన్నాడు.
పూర్ణయ్య ఆదిత్యసింహుడి వైపు ఏమిటది అన్నట్టు చూసాడు.
ఆయన మొహంలోని భావాలు అర్ధం చేసుకున్న ఆదిత్యసింహుడు, “మా వదిన గారు నా పట్టాభిషేకానికి ఆటంకాలు కలిగిస్తారని నాకు తెలుసు…అందుకే నా ప్రయత్నాలలో నేను ఉన్నాను…కాని ఇక్కడ మీకు తెలియవలసి విషయం ఏంటంటే మా వదినగారికి అత్యంత నమ్మకమైన చెలికత్తె మంజుల భర్త ఆమె రాచకార్యం మీద కాదు వెళ్తున్నది,” అంటూ ఒక్క నిముషం ఆగి పూర్ణయ్య వైపు చూసాడు.
ఆయన చాలా ఆసక్తిగా ఆదిత్యసింహుడు చెప్పేది వింటున్నాడు.
మళ్ళీ ఆదిత్యసింహుడే, “మంజుల భర్త వెళ్తున్నది…నా రాచకార్యం మీద మా వదిన గారి అన్న అయిన పరాశిక రాజ్యానికి రాజయిన విక్రమ వర్మ దగ్గరకు వెళ్ళారు,” అన్నాడు.
ఆదిత్యసింహుడు చెప్పింది విన్న మహామంత్రి పూర్ణయ్య ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కొద్దిసేపు పట్టింది.
ఆయన కళ్ళల్లో ఆదిత్యసింహుడిని మెచ్చుకోలు కనిపిస్తున్నది.
“భళా….ఆదిత్యా….భళా….నీకు రాజతంత్రంతో సరిపోయేవారు ఎవరు లేరు,” అని పూర్ణయ్య ఆదిత్యసింహుడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
కాని అంతలోనే పూర్ణయ్య, “మంజుల భర్త నీ రాచకార్యం చేయడాని ఎలా అంగీకరించాడు….నువ్వు మంజలని ఏమైనా…..” అంటూ మధ్యలో ఆపి ఆదిత్యసింహుడి వైపు అనుమానంగా చూసాడు.
ఆదిత్యసింహుడు నవ్వుతూ మంజులను తన దగ్గరకు తన వదిన పంపించిన దగ్గర నుండి ఇంతకు ముందు రమణయ్యతో జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పాడు.
కాని తను తన వదిన స్వర్ణమంజరిని కోరుకుంటున్నట్టు మాత్రం చెప్పలేదు.
అంతా విన్న పూర్ణయ్య మనసు సంతోషంతో నిండిపోయింది….కాని తన మనసులో