రాజ్య సింహాసనం 11
రాజ్య సింహాసనం 11 అతను వెళ్ళిపోగానే ఆదిత్యసింహుడు రమణయ్య వైపు చూసి, “ఇప్పుడు మంజులకు మనకు అనుకూలంగా చేయడం తప్పించి వేరొక దారి లేదు…ఒక వేళ మనకు ఎదురుతిరిగితే ఇక్కడ ఆమె మొగుడు, కొడుకు కడతేరిపోతారు…అది కాక తనకు ద్రోహం చేసినందుకు మా వదిన గారు మంజులను చంపేస్తుంది…అందుకని మీరు మీతో పాటు మంజులని నిరభ్యంతరంగా తీసుకెళ్ళొచ్చు…ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా?” అని అడిగాడు.
దాంతో రమణయ్య, “మీరు ఇంత నమ్మకంగా చెప్పిన తరువాత నేను అభ్యంతరం ఎందుకు చెబుతాను ప్రభూ…..,” అన్నాడు.
అది విని ఆదిత్యసింహుడు కాపలావాడిని పిలిచి మంజుల వాళ్ళను లోపలికి రమ్మన్నాడు.
కాపలావాడు బయటకు వెళ్ళి మంజుల వాళ్ళను లోపలికి పంపించాడు.
మంజుల, ఆమె మొగుడు, కొడుకు లోపలికి వచ్చి ఆదిత్యసింహుడికి నమస్కారం చేసి నిల్చున్నారు.
ఆదిత్యసింహుడు మంజుల మొగుడి వైపు చూసి, “నీ పేరు ఏంటి?” అని అడిగాడు.
“రాజయ్య ప్రభు,” అన్నాడు మంజుల మొగుడు.
“ఇప్పుడు ఎక్కడైనా పని చేస్తున్నావా?” అని ఆదిత్యసింహుడు అడిగాడు.
“లేదు ప్రభు…..తమరు ఏదైనా దయ తలిస్తే మీ దగ్గర కొలువు చేసుకుంటూ నమ్మినబంటుగా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను,” అన్నాడు రాజయ్య వినయంగా చేతులు కట్టుకుని.
దాంతో ఆదిత్యసింహుడు రాజయ్య వైపు చూసి ఆలోచిస్తూ ఒక సారి తల ఊపి రమణయ్య వైపు చూసి సైగ చేసాడు.
ఆదిత్యసింహుడి సైగను అర్ధం చేసుకున్న రమణయ్య మంజుల వైపు చూసి, “మంజుల…నువ్వు ప్రభువుల వారికి అనుకూలంగా చేసిన పనికి గాను నిన్ను ఆదిత్యసింహ ప్రభువుల తరుపున రాణి స్వర్ణమంజరీ దేవి గారి దగ్గర చెలికత్తెగా ఉంటూ