రాజ్య సింహాసనం 7
రాజ్య సింహాసనం 7 అప్పటి దాకా వీరసింహుండిలో ఉన్న మదిర మత్తు పూర్తిగా దిగిపోయింది. ప్రభావతి కూడా తన భర్త వీరసింహుడు పూర్తి సృహలో ఉన్నాడని నిర్ధారణకు వచ్చిన తరువాత, కింద పడిన తన చీరను తీసుకుని మళ్ళా కట్టుకున్నది.
వీరసింహుడికి ప్రభావతి ప్రవర్తన ఎందుకో విచిత్రంగా అనిపించింది, “అసలు చీర ఎందుకు విప్పింది….మళ్ళీ ఎందుకు కట్టుకుంటున్నది,” అని మనసులోఅనుకుంటూ ఆమె వైపు అర్ధం కానట్టు చూసాడు.
ప్రభావతి కాపురానికి వచ్చిన దగ్గర నుండి తన భర్త ఎలా ప్రవర్తిస్తాడు, అతని అలవాట్లు, అభిరుచులు, అతని మనఃస్థితి అంతా బాగా తెలుసు.
వీరసింహుడి గురించి ఆదిత్య సింహుడి తరువాత ప్రభావతికే బాగా తెలుసు.
తన భర్త తన వైపు అలా చూస్తుండే సరికి ప్రభావతి అతని మనసులో భావాలు చదివినట్టు, “ఇదేమీ మహాభారత కాలం కాదు నాధా….బలవంతులైన తమ్ముళ్ళు అన్నకి సహాయం చేయడానికి….కలియుగం…ఇక్కడ బలం ఉన్న వారిదే రాజ్యం….ఇప్పుడు ఈ సామ్రాజ్య సింహాసనం కూడా ఒక యుధ్ధంలాంటిదే, ఆ యుధ్ధం మీ ముగ్గురి అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది…మీరు ఇందాక మదిర మత్తులో ఉండి విచక్షణ కోల్పోయారు, మీరు ఏంమాట్లాడుతున్నారో మీకే అర్ధం కావడం లేదు…అందుకే ఆ మత్తు దించడానికే నేను మీ ముందు చీర విప్పి మీ దృష్టి చిరాకు నుండి మళ్ళించాను… ఇప్పుడు మీరు ఆ మత్తు నుండి బయట పడ్డారు…కాబట్టి ఈ కాంతా మత్తులోకి మిమ్మల్ని దించడానికి ముందు జరగబోయే వాటి గురించిమాట్లాడుకుందామని మళ్ళీ చీర కట్టుకున్నాను,” అన్నది
వీరసింహుడికి ప్రభావతి ఆరోజు చాలా కొత్తగా వింతగా కనిపిస్తున్నది.
ఆమెలో ఇంత పరిశీలనా శక్తి దాగున్నదా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు.
ప్రభావతి చీర కట్టుకుని తల్పం మీద వీరసింహుడి పక్కనే