పూజిత సుబ్రహ్మణ్యం 1
పూజిత సుబ్రహ్మణ్యం 1 1990 ఖమ్మం జిల్లా ఓ మారు మూల గుడి.చీకటి పడుతుండగా ఎద్దుల బండిలో ఓ ముగ్గురు దిగి గుడిలోకి వస్తున్నారు.ఒక యువకుడు , ఒక మధ్య వయస్సు ప్రౌఢ కలిసి చక్రాల కుర్చీలో ఉన్న ఒక నడి వయస్సు వ్యక్తిని జాగ్రత్తగా పట్టుకుని గుడిలోకి వస్తున్నారు.
గుడి మూసేయ్యబోయిన పూజారి వారిని చూసి ఆగి ఎదురెళ్లి ..
" అమ్మా మీరు పూజిత సుబ్రహ్మణ్యం గారేనా…ధర్మకర్త గారు ఏదో జంటకి శూన్య ముహూర్తం లో వివాహం జరిపించమని కబురు చేశారు.మీరు ఆ తాలూకా యే నా…
నమస్కారం పూజారి గారు...మీ ధర్మకర్త గారు చెప్పి పెట్టింది మా గురించే….నేనే పూజ , వీరు మా వారు సుబ్రమణ్యం, నా కొడుకు మోహన్.హైదరాబాద్ నుంచి వస్తున్నాం.22 ఏళ్ళ క్రితం ఇదే గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నాం...మీరే జరిపించారు ,గుర్తు లేదా..
హ్..ఆ..ఆ చేసాను..గుర్తొస్తుంది. మీరా ,బావున్నారా
Baavunaam అండి...మీరు మళ్ళీ మరో పెళ్లి చేయాలి , ఆరోజుల్లో ఎవ్వరు మా వివాహాన్ని జరిపించుటకు ఒప్పుకోకపోయిన విశాల ఆలోచనతో మీరు జరిపించారు.అందుకే ఈ వివాహం కూడా మీ చేతుల మీదే జరిపించాలని అంత దూరం నుండి వచ్చాము.
ఆలాగేనమ్మ… లలక్షణంగా జరిపిస్తాను.నాకు కుల , మత పట్టింపులేమి లేవు.ధైర్యంగా జరిపిస్తాను.కానీ అమ్మాయ్….ఎందుకని శూన్య ముహూర్తం లో జరిపించాలన్నారు అంట. అటువంటి ముహూర్తం లో జరిగే వివాహ బంధాలు కలకాలం నిలువవు అని తెలియనట్లుంది బహుశా మీకు..
అదేం లేదు పూజరిగారు.మాకు బాగా తెలుసు.ఈ వివాహ బంధము తాత్కాలిక కాలానికే పరిమితం అవ్వాలి అనేదే మా ఉద్దేశం కూడా...అందుకే అలా.
ఏమిటోనమ్మా…ఎవరైనా నూరేళ్ళ బంధానికి వివాహం చేసుకుంటారు...కానీ మీరేమో తాత్కాలిక కాలానికి వివాహం అంటున్నారు..విచిత్రం…సరే నాకెందుకు వచ్చిన దురద…అలాగే జరిపిస్తాను...116 లు సంభావన ,ఫల పుష్పలూ నా దక్షిణ ...ఇకపోతే మీరడిగిన సూన్య ముహూర్తం రేపు తెల్లవారి 3 గంటలకి ఉంది.
ఏమిటి ...కాయమేన? మరి సరంజామా తెచ్చుకోవడం అయిందా? ఇక్కడ అవేమి దొరకవు...ఒకవేళ పట్టణం వెళ్లి వద్దమన్నా రాత్రులు దుకాణాలు ఉండవే…
అయ్యో..మేము వస్తూ వస్తూ సరుకు , సరంజామా అన్ని తెచుకున్నాం పూజరిగారు.ఏమి తక్కువలేవు.
ఓహో...సిద్ధంగానే వచ్చారన్నమాట, సంతోషం.మరింకేం అయితే 2 గంటల సమయానికి ఆ మంటపం అలంకరించి వధు , వరులను సిద్ధం చేసి ఉంచండి.నేను వచ్చి తతంగం పూర్తి చేయిస్తాను లక్షణంగా…
అలాగే పూజరిగారు...మీరు చెప్పినట్టే ఏర్పాట్లు చేసి ఉంచుతాం.
ఆలాగేనమ్మ...అడుగుతున్నా అని మరోలా అనుకోవద్దు , మీ వారికి ఎప్పటినుంచి ఇలా…
3 ఏళ్ల క్రితం పక్షవాతం బారిన పడ్డారు...అప్పటినుండే ఈ కష్టాలు...అదే ఈయనే బాగుంటే ఇక్కడ ఇలా మేము ఉండేవాళ్ళమే కాదేమో…
బాధపడకు తల్లి...అంత సర్వేశ్వరుడి ఆట...మళ్ళీ ఆయనే మంచి రోజులు ప్రసాదిస్తాడు లే...మరి నేను ఎల్లోస్తాను…
అలాగే పూజరిగారు...ఎదురుచూస్తుంటాం…
మంచిదమ్మా…..
తెల్లవారుజామున కు ముందు జాముల్లో 2.30 గంటలకి