ప్రియుడు….3
telugu stories kathalu novels ప్రియుడు….3 రెండు మనసులు ఇంత గాఢంగా ఏకం అయిన తర్వాత…. రెండు శరీరాలు కలిస్తే తప్పేమిటీ? ఉలిక్కిపడ్డాడు… కుమార్… గబగాబా మరో పేజీ తిరగేసాడు. ”… నేను వెళ్ళగానే రాజ్ నా గురించి ఎదురు చూస్తూ ఉండడం గమనించాను. అతని మొహంలో నేనేం చేబుతానా అనే ఆతృత స్పష్టంగా కనిపిస్తుంది. అతను గబగబా అడుగులేసుకుంటూ నా ఎదురుగా వచ్చాడు. నేను చెప్పబోయే సమాధానం కోసం టెన్షన్ గా చూస్తున్నాడు. ఆ క్షణంలో అతని మొహాన్ని చూస్తుంటే ముచ్చటేసింది నాకు…
నిజంగా రాజ్ కి నేనంటే ఎంత ప్రేమ…! నా గురించి అతడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు… కానీ… నేను మేమిద్దరం ఏకం కావడం గురించి ‘ఆ’పని చేయడం నాకేం తప్పుగా అనిపించలేదు. ఇంక అతన్ని మరింత టెన్షన్ కి గురి చేయడం ఇష్టం లేక తల దించుకుని మెల్లిగా అన్నాను. ”సరే… మీ ఇష్టం…”
నేను అలా అనగానే అతను ఎగిరి గంతేశాడు. నాచుట్టూ వెర్రిగా అరుస్తూ తిరిగాడు…. పచ్చికపైన పడి దోర్లాడు… అతని సంతోషాన్ని చూస్తూ నేను కూడా మనసులో ఎంతో ఆనందించాను. మేమిద్దరం కలవడానికి అతను ప్లేస్ ని సెలెక్ట్ చేశాడు. మరో రెండు రోజుల్లో మేము ఏకం కావడానికి సమయం ఫిక్స్ చేసుకున్నాము. ఈ రెండు రోజులూ ఎంతో టెన్షన్ గా గడిపాను నేను. అతనితో గడిపే ఆ క్షణాల కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూసాను. ఆ సమయం కోసం క్షణమొక యుగంలా గడిపాను.
అతని బాహువుల మధ్య నలిగిపోవడానికి నా శరీరం ఎప్పుడో సిద్ధపడిపోయింది. అతని అధరాలని చుంభించడానికి నా పెదాలు సిద్దంగా ఉన్నాయి. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ సమయం రానే వచ్చింది…!!
కుమార్ ఆగలేనన్నట్లు మరో పేజీ తిప్పాడు. అది బ్లాంక్ గా అతన్నివెక్కిరిస్తూ కనిపించింది. మరో పేజీ తిప్పాడు అది కూడా ఖాళీగానే ఉంది. అలా పెజీలన్నీ తిప్పినా మరింకేమీ