ప్రియుడు….2
telugu stories kathalu novels ప్రియుడు….2 అది చదివిన కుమార్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరో పేజీని తిరగేసాడు. ”….నేను కాలేజీకి వెళ్ళగానే నా కళ్ళు అతని కోసం గాలించాయి. ఈ రోజు అతనితో మాట్లాడాలని అనుకున్నాను. కానీ అతను కనిపించకపోయేసరికి ఎక్కడ లేని నిరాశ నన్ను ఆవహించింది… ఎంతో చిరాకు, విసుగు కలిగాయి. కాలేజీ అంతా వెతికినా కూడా అతని జాడ కనిపించలేదు. దిగులుగా కాలేజీ నుంచి బయటకు వస్తూంటే హఠాత్తుగా అతను నా ఎదురుగా వచ్చాడు. నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు.
ఆతని చూపులు నా వైపు నిశ్చలంగా చూస్తున్నాయి ఆ చూపులో ఎన్నో భావాలు… అతను కళ్ళతోనే నవ్వుతున్నాడు…. అతను కనిపించకపోవడంతో నేను పడిన వేదనని అర్థం చేసుకున్నాడో ఏమో… మెల్లిగా తన కుడిచేతిని పైకి లేపాడు. నేను అతని కళ్ళలోకే చూస్తూ ఉండిపోయాను. మా ఇద్దరి మధ్యలో అందంగా ఎర్రగా మెరుస్తూ కనిపించింది గులాబీ పువ్వు! అతని చేతిలో ఉన్న పువ్వుని అందుకుని చటుక్కున అక్కడి నుంచి పరుగెత్తాను. ఈ రోజు నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
అతను నాకోసం ప్రేమగా ప్రజెంట్ చేసిన ఆ గులాబీ పువ్వుని చూస్తూనే తెల్లవార్లూ గడిపాను… అప్పుడు నాకు అనిపించింది నేను అతన్ని ప్రేమిస్తున్నానని…. అ ఆలోచన రాగానే నా మనసు మేఘాల్లో విహరించడం ప్రారంభించింది… ఆ గులాబీ పువ్వులో అతన్ని ఊహించుకుని సుతిమెత్తగా ముద్దు పెట్టుకున్నాను. ఆ పువ్వులో అతను నన్ను చిలిపిగా చూస్తూ కనిపించాడు… నా మనసు అతనిపైన తన్మయత్వంతో నిండిపోతూ