ప్రియమైన శత్రువు 4
telugu sex stories rebus-dm.ru ప్రియమైన శత్రువు 4 గాల్లో స్పీడ్ గా కింద పడుతున్న నేను ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది.... కళ్ళు తెరిచి చుట్టూ చూసాను దూరంగా ఒక కాంతి.... దాని దెగ్గరికి వెళ్ళాను ఎవరో నిల్చుని ఉన్నారు మొహం కనిపించట్లేదు... మళ్ళీ భూమి వైపు వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు.... అతనెవరో నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అది ఒక్క చేత్తో.
రుద్ర : ఎవరు నువ్వు?
❤️ : నీ తండ్రిని.
ఆశ్చర్యంగా చూసాను.
❤️ : అవును కుమారా, నువ్వు నా అంశవే.... నా వల్లే నువ్వు ఈ భూమి మీద జన్మించావు...
రుద్రా : హో భూమ్మీదే కాదు పైలోకం లో వాళ్ళు కుడా నన్ను వదిలించుకున్నారన్నమాట.
ఐతే నన్ను ప్రతి సారి చావకుండా ఆపేది నువ్వేనా?
❤️ : అవును.
రుద్ర : ఈ కష్టాలు కూడా నీవల్లేనా?