ప్రేమాభిషేకం 9
naa telugu kathalu ప్రేమాభిషేకం 9 కావ్య తో విజయ్ గురించి అడగాలా వద్దా అనే ఆలోచనల్లో ఉండగానే, తను అభి ఎదో అడగాలి అనుకుంటున్నావు పర్లేదు అడుగు అంది. అదేంలేదు నువ్వు విజయ్ ఆలా వెళ్లిపోవడం గురించే అన్నా. ఓహ్..నాకు ముందే తెలుసు నువ్వు అదే అడుగుతావని, నిజం చెప్పాలంటే అసలు ఆ రోజు ఆలా ఎందుకు వెళ్లానో ఇప్పటికి అర్ధంకాదు, మీరు లేని ఆ వారం రోజులు నేను విజయ్ కలిసి చదివే వాళ్ళం, అప్పుడు తన మాటలు తను చేసే అల్లరి పనులు నాకు కొత్తగా అనిపించేవి, తను ఒక అడ్వెంచర్స్ ట్రిప్ లా అని అనగానే నాకు కొత్త గా అనిపించింది, ఏమి ఆలోచించ కుండా వెళ్ళిపోయా అంతే. కానీ తరువాత అర్థమైంది నేను ఎంత పిచ్చిగా చేసానో అని, కానీ ఒకటి చెప్తాను తనతో ఏ రోజు హద్దు దాటి వెళ్ళలేదు, నాతో ఆలా బిహేవ్ చేసి ఉంటె ఆ రోజే