ప్రేమాభిషేకం 5
naa telugu kathalu ప్రేమాభిషేకం 5 నా మాటలు విన్న తాతయ్య అమ్మ షాక్ గా నా వైపు చూసారు, ఎందుకంటే నేను చదువుకుంటాని అని అన్నది చెన్నైలో ఇప్పటి వరకు నాకు చెన్నై తో కానీ అక్కడి మనుషులతో కానీ ఎటువంటి పరిచయాలు కానీ లేవు. అసలు అది ఒక్కటే కాదు ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళింది లేదు. ఆ మాట వినగానే అమ్మమ్మ నాతో అదేంటిరా అక్కడ ఎవరు ఉన్నారు అని అంతదూరం వెళ్లి చదువుతాను అంటున్నావ్, పైగా ఇన్నాళ్లు మీ అమ్మకి తోడుగా నువ్వు ఉన్నావ్ నువ్వు అంత దూరం వెళ్ళిపోతే ఇక్కడ అమ్మకి తోడు ఎవరుంటారు అని అడిగింది కానీ నాకు ఆ ప్రశ్నలకు ఎం సమాధానము చెప్పాలో అర్ధంకాక ఆలా నిలబడి వాళ్లనే చూస్తూ ఉన్న, వెంటనే అమ్మ కలగచేసుకుంటూ అదేం కాదు పిన్ని వాడు నాతో ముందే చెప్పాడు అక్కడ అయితే బెస్ట్ కాలేజ్ లు ఉన్నాయి వాటిలో చదివితే మంచి కంపెనీస్ లో జాబ్ వస్తుంది ఇక నేను ఇక్కడ ఒంటరిగా ఉండడానికి పెద్ద ఇబ్బంది ఎం