ప్రేమాభిషేకం 30
naa telugu kathalu ప్రేమాభిషేకం 30 రేయ్ అభి నిన్నే రా...అలా కొయ్యలా నిలబడి చూస్తున్నవేంట్రా అంబులెన్సు కి కాల్ చెయ్యరా...వీడికి రక్తం ఆగడంలేదు అంటూ అమ్మ ఏడుస్తూ వాడిని ఒళ్ళో పెట్టుకుని రక్తాన్ని గుడ్డ అడ్డుపెట్టి ఆపడానికి ట్రై చేస్తుంది. నాకు మాత్రం వాడు ఇక్కడే ఇలాగే విల విలల్లాడుతూ చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, నేను ఇప్పటివరకు పడిన బాధకి ఆ విజయ్ గాడికి ఇదే సరైన శిక్ష...రేయ్ అభి...అభి....అభి...అభి...మెల్లగా అమ్మ గొంతు మారిపోవడం తెలుస్తూనే ఉంది నాకేం అర్ధం కావడంలేదు కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నా, ఎదురుగా