ప్రేమాభిషేకం 3
naa telugu kathalu ప్రేమాభిషేకం 3 అమ్మమ్మ నాతో మీ తాతయ్య కి కూతురు తినకపోతే మనసు ఊరుకోదు అని నవ్వుతూ అంటే దానికి తాతయ్య నీకు నీ మనవడు అంటే ఎంత ప్రేమో నా కూతురంటే అంతా ప్రేమ ఆ మాటకి అన్నాడు ముగ్గురం ఒక్కసారిగా నవ్వుకున్నాం.(తాతయ్య అమ్మమ్మకి ఇద్దరు పిల్లలు అమ్మాయి & అబ్బాయి(నాకు వరసకు పిన్ని మావయ్య అవుతారు) పేరు దీప్తి పెళ్లి అయ్యి 6 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ లో ఉంటుంది వాళ్ళ ఆయన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇక మావయ్య వివేక్ బెంగుళూరులో డాక్టర్ చదువుతున్నాడు) ముగ్గురి భోజనాలు అయ్యాక వెళ్లి రూమ్ లో పడుకున్న కానీ నిద్ర రావడం లేదు అమ్మ ఎందుకు అంతలా కొట్టాలి ఎందుకు నేను చెప్పేది నమ్మడం లేదు ఎందుకు కావ్య గురించి అంతలా బాధపడుతుంది అన్నింటికీ మించి ఒక్కటే ప్రశ్న విజయ్ గురించి అమ్మకి ఎలా తెలుసు వాడు వచ్చిన క్రొత్తలో అమ్మ వాడితో బాగానే మాట్లాడేది కానీ రాను