ప్రేమాభిషేకం 12
naa telugu kathalu ప్రేమాభిషేకం 12 సాయంత్రం 4 గంటలకి నీకు ట్రైన్ అక్కడ దిగిన తరువాత మావయ్య ఫ్రెండ్ కి కాల్ చెయ్యి ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే మావయ్య కి కాల్ చేసి చెప్పు. ఏదైనా కాష్ అవసరం అయితే వెంటనే నాకు కాల్ చెయ్యి. కాలేజ్ లో కొంచెం జాగ్రత్త గా ఉండు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ని కూడా అడిగాను కాలేజ్ లో తెలుగు వాళ్ళు కూడా ఉంటారంటా, నీకు బాష గురించి ఇబ్బంది కూడా ఉండదు. నువ్వు ఉండే రూం కూడా చూసాను బాగానే ఉంది. కొత్త ప్లేస్ అలవాటు కావడానికి నీకు టైం పడుతుంది, పోను పోను అలవాటు అవుతుందిలే అని నా వైపు చూడకుండానే నా సెల్ఫ్ లో ఉన్న బట్టలు సర్దుతూ మాట్లాడుతుంది.అమ్మ నా వైపు తిరగకుండా ఆలా ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థమైంది...వెంటనే అమ్మా అని పిలిచినా కూడా నా వైపు తిరగకుండా ఎదో