అతన్ని చూడగానే ఉత్సాహంగా, “అన్నయ్యా! ఎప్పుడొచ్చావ్?” అంది ప్రతిమ. “ఇప్పుడేనే.. ఏంటీ నా మేనల్లుడితో బిజీనా!” అన్నాడు. “అదేం లేదు. రా భోజనం చేద్దువు గానీ.” అంటూ ఉండగా, కార్తీక్ బయటకు వచ్చి, మావయ్యను పలకరించాడు. అల్లుడిని పలకరిస్తూ, చెల్లెలితో “బట్టలు సర్దుకోండి వెళ్దాం.” అన్నాడు. ప్రతిమ భర్త ఆశ్చర్యపోతూ, “అదేంటి బావా! నీ కూతురి పెళ్ళికి ఇంకా వారం ఉందికదా.” అన్నాడు. “ముందు మీరు ఎలానూ రారు, కనీసం మేనత్త దాన్ని అయినా పంపకపోతే ఎలా?” అన్నాడతను.
“అది ఒక్కత్తే ఎలా వస్తుందీ!?”
“ఒక్కత్తే ఎందుకూ, మా అల్లుడు కూడా వస్తాడు.”
“వాడా! వద్దు..వాడికి ఈ పెళ్ళిళ్ళు అంటే అసలే చిరాకు..” కంగారుగా అంది ప్రతిమ.
“పరవాలేదులే అమ్మా.. అక్కడ నీకేమైనా