పెళ్ళికి ముందు…! 2
telugu stories kathalu novels పెళ్ళికి ముందు...! 2 తెల్లటి చీరలో అందంగా మెరిసిపోతుంది లావణ్య.. ఆమె చేతిలో పాలగ్లాసు.. మొహంలో సిగ్గుస్థానంలో ఒక విధమైన భయం గోచరిస్తోంది. గుమ్మం లోపలకి నెట్టి వేయబడింది. ఆ వెంటనే తలుపులు మూసుకున్నాయి... అవతలనుంచి నవ్వుల శబ్దం క్రమంగా మాయం అయిపోయింది... ఆమె వంటి పైన బంగారు ఆభరణాలు, మెరిసిపోతున్నాయి.... కానీ మెడలో తాళిబొట్టులేకపోవడంతో అవన్నీ కళావిహీనంగా మారిపోయాయి.
"స్వాగతం... నాక్కాబోయే అర్థాంగి గారికి” కొంటెగా అన్నాడు సందీప్ అతని మాటలకి ముభావంగా ఉండిపోయింది లావణ్య... ఆమె మొహంలో కించిత్తైనా సిగ్గు కనిపించక పోయే సరికి చిన్నబుచ్చుకున్నాడు... “ఏంటి లావణ్య... నేనేమైనా పరాయి వాడినా... నీక్కాబోయే భర్తనేగా... నన్ను చూసి కాస్త అందంగా నవ్వవచ్చు. కదా'' చిన్న పిల్లాడిలా మొహం పెట్టి అన్నాడు... అతని మాటలు ప్రవర్తన లావణ్య మనసుని కరిగిస్తున్నాయి...” నా మీద కోపంగా వుందా? అయినా నేను కోరిన కోరికలో తప్పేముంది...? అదే మనం ప్రేమికులమైతే పెళ్ళికి ముందు ఎన్నిసార్లు..” చివ్వున తల ఎత్తింది లావణ్య” అదే... కనీసం ముద్దూ ముచ్చటైనా తీర్చుకునేవాళ్లం కదా' మాటామార్చాడు... బుంగమూతి పెట్టి మొహాన్ని పక్కకు తిప్పుకుంది లావణ్య... సందీప్ ఆమె వైపు మురిపెంగా చూశాడు... ఈ పాలు నా కోసమే కదా అంటూ ఆమె చేతిలోని గ్లాసందుకుని పాలన్నీ గటగటా త్రాగేసాడు... గ్లాసులో సగపాలు తనకిస్తాడనుకున్న లావణ్యకి ఆశాభంగమే ఎదురైంది..
“ఓసారీ లావణ్య... పాలన్నీ త్రాగేసాను... మన ఒరిజినల్ శోభనం అప్పుడు ఇద్దరం షేర్ చేసుకుందామ...” ఆమె మాట్లాడలేదు.. అతని మాటలు గమ్మత్తుగా అనిపిస్తున్నాయి లావణ్యకి.. ఎందుకో సందీప్ పైన నమ్మకం కలుగుతుంది. ఆమె భుజాల పై రెండు చేతులు వేసి బెడ్ వరకు తీసుకు వచ్చి కూర్చుండబెట్టాడు. నా భార్య ఇంత అందంగా ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు తెలుసా? నా అదృష్టం కొద్దీ నువ్వు నాదానివవుతున్నావు” మనస్పూర్తిగా అన్నాడు సందీప్... ఆ మాటలకి ఆమె మొహంలో కోపం స్థానంలోనే