పెళ్ళికి ముందు…! 1
telugu stories kathalu novels పెళ్ళికి ముందు...! 1 అమెరికా సంబంధం... ఇలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది... ముందు నువ్వొప్పేసుకో మాధవరావు గారూ...! కంగారు పెట్టేస్తాడు మ్యారేజ్ బ్యూరో ఓనర్ లింగరాజు...
“మాధవరావు దీర్ఘాలోచనలో పడిపోయాడు... ఫోటోలో అబ్బాయి చూస్తే చూడముచ్చటగానే ఉన్నాడు... అతనిలో వంక పెట్టాల్సిన ఏ ఒక్క అంశమూ మాధవరావుకి కనిపించలేదు... కానీ అతను ఆలోచిస్తున్నది ఒక్కటే... అమెరికా సంబంధం అంటే ఆశామాశీ వ్యవహారం కాదు... చాలా కట్నకానుకలతో కూడుకున్న పని... ఒక వేళ సంబంధం కుదిరితే తాను అంత ఖర్చుని భరించగలడా అన్న ఆలోచన మాధవరావు మదిని తొలిచేసింది... లింగరాజు అసహనానికి గురయ్యాడు.... మాధవరావు ఆలోచనలని కని పెట్టినట్లు... “మాధవరావు గారూ.. మీరేం ఆలోచిస్తున్నారో అర్థం అయ్యింది.. కట్నకానుకల విషయమే కదా..! దాని గురించి మీరేమీ బెంగ పెట్టుకోకండి... అమ్మాయి లక్షణంగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా వుంటే చాలు.. ఖానీ కట్నం అవసరంలేదని వాళ్ళు నాకు ముందే చెప్పారు. ఇక ఈ విషయం గురించి ఆలోచించకుండా అందివచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి... ముందు జరగవలసింది చూడండి” తొందర చేసాడు లింగరాజు...
“మీరు చెప్పింది బాగానే వుంది. కానీ ఈ మధ్య అమెరికా పెళ్ళిళ్ళు అంటూ జరుగుతున్న మోసాలు పేపర్లలో వస్తున్నాయి...' నసిగాడు మాధవరావు... లింగరాజు చిరాకుగా మొహం పెట్టి “అబ్బా మీకన్నీ అనుమానాలే ఎవరో ఎదో మోసం చేసారని ప్రతివారినీ అనుమానిస్తే ఇక మనం ముందుకేం వెళతాం ... ఒకరైలు పట్టాలు తప్పింది కదా అని ప్రయాణం మానుకోముకదా... అయినా మీ అనుమానం నివృత్తి చేయడానికి రేపే ఊరిలో ఉన్న ఈ పెళ్లికొడుకు తాతయ్య వాళ్లింటికి తీసుకువెళ్తాను... అన్నీ పరిశీలించాకే నీ నిర్ణయం చెబుదువుగానీ!” లింగరాజు అన్న చివరి మాటలకు మాధవరావు తృప్తిగా తలాడించాడు. అనుకున్నట్టుగానే మరునాడే ప్రయాణం కట్టారు... నల్లగొండ జిల్లాలోని మారుమూల గ్రామం అది చుట్టూ పచ్చని పొలాల మధ్యన అందంగా