పెళ్లి రోజు …2
telugu stories kathalu novels పెళ్లి రోజు ...2 శైలజ లోపలి రాగానే అందరూ చప్పట్లతో ఆమెని స్వాగతించారు. ''శైలజక్క ఇక్కడున్నన్ని రోజులు మనమీద ఈగకూడా వాలాదు...'' ఆనందంగా అంది స్వరూప.
''కావేరీ నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరంటున్నావుగా... ఆ గ్యాంగ్ లో ఒకర్ని సెలక్ట్ చేసుకో... అప్పుడు నీకు బాడీగార్డ్ గా కూడా పనికివస్తాడు...'' నవ్వుతూ అంది మాధవి.
''మీరే అన్నారుగా, మనకి శైలజక్క బాడీగార్డని, ఇంకా వేరే బాడీగార్డు లెందుకు దండగ...''అంది నవ్వుతూ శైలజ కూడా నవ్వింది.
''అవునక్కా నీ పెళ్ళి అయ్యాక కూడా నిన్ను ఉద్యోగానికి ఎలా పంపించారు... నా ఉద్దేశ్యం చాలా వరకు పెళ్ళి కాగానే ఉద్యోగాన్ని వదిలేసి ఇంటిపట్టునే ఉండమంటారు కదా అని'' తనలోని అనుమానాన్ని శైలజ ముందుంచింది కావేరి.
శైలజ చిన్నగా నవ్వింది. ''ఆయన కూడా టీచర్... మా పెళ్ళయి సంవత్సరం కావొస్తోంది... మొదట్లో నేనూ ఉద్యోగం వదులుకుని ఇంటిపట్టునే ఉండాలనుకున్నాను. కానీ ఆయన మంచి మనసుతో ఎందుకు వదులుకుంటావు... ఉద్యోగానికి వేళ్ళు... ఇంట్లో నీకూ బోర్ గా వుంటుంది కదా అన్నాడు... అందుకే చేస్తున్నాను...'' నవ్వుతూ అంది.
''మరి మీరు కలుసుకునేదేప్పుడూ...'' శైలజ కావేరి వైపు అదోలా చూసింది. తనమాటలో డబుల్ మీనింగ్ ఉందని అర్థమై నాలుక్కరుచుకుంది కావేరి. ''సారీ అక్కా... నా ఉద్దేశ్యం.... మీరు ఎన్నిరోజులకోసారి మీ ఇంటికి వెళతారు?'' అని అంది.
''మా వారు కూడా నాలాగే వేరే ఊర్లో జాబ్ చేస్తున్నారు. స్కూల్ కి ఏదైనా సెలవులు వస్తే ఇద్దరం ఠంచనుగా ఇంట్లో వాలిపోతాం ... నాకేప్పుడైనా ఆయనని చూడాలనిపిస్తే ... ఫోన్ చేసి ఆదివారం రోజు మా ఇంటికి రామ్మంటాను. నేనూ ఇక్కడి నుండి శనివారం సాయంత్రం బయలు దేరి, తిరిగి సోమవారం ఉదయానికల్లా వచ్చేస్తాను...'' అంది శైలజ.
కావేరికి ఎంతో ఆశ్చర్యమేసింది. పెళ్లై సంవత్సరమైనా కాలేదు. ఇద్దరూ దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు... వారి కోరికలను మనసులోనే అణుచుకుని ఎప్పుడో సెలవులకి ఛాన్స్