పెద్దమ్మ కోరిక 2
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 2 వార్డెన్ బయటే ఆగిపోయారు . బెల్ బాయ్ హడావిడిగా బయటకువచ్చి మొబైల్ తీసి కాల్ చేసి రేయ్ రేయ్ రేయ్ వస్తామని రాకపోతే ఎలా రా 7 గంటలకు షో స్టార్ట్ అవుతోంది .......... అవతలివైపు కట్ చేసినట్లు కోపంతో మొబైల్ పగలగొట్టబోయి ఆగి అయిపోయాను సర్ నన్ను చంపేస్తారు . ఈ నాకొడుకులు టైం చూసి హ్యాండ్ ఇచ్చారు.వార్డెన్ : బాబు బాబు .......... ఏదో టెన్షన్ లో ఉన్నట్లున్నారు . సర్ మమ్మల్ని అదే ఆ పిల్లల్ని రమ్మన్నారు - ఏదైనా పని ఇస్తామన్నారు అని చూపించారు .
బెల్ బాయ్ : పెద్దయ్యా .......... సరైన సమయానికి తీసుకొచ్చారు . థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , పిల్లలూ రండి అని లోపలికి పిలుచుకునివెళ్లాడు . సర్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు పిల్లలు .............సర్ : మా పేర్లను కనుక్కుని , పిల్లలూ .......... సమయం లేదు అని ఒకరిని పిలిచి ఈ అన్నయ్య మీరు ఏమిచెయ్యాలో చెబుతాడు వెళ్ళండి అనిచెప్పారు . వార్డెన్ : మహేష్ ........... all the best పూర్తయ్యాక జాగ్రత్తగా రండి