( రాధిక పసందైన కథలు సంచిక నుండి )
అరగంట క్రితమే లాడ్జి ఖాళీ చేసి వెళ్ళిన సుధీర్ తిరిగి రావడంతో ఆశ్చర్యపోయాడు లాడ్లీ మేనేజర్ సుబ్బారావు. “ఏమిటి సార్.. యిప్పుడేగా వెళ్ళారు.. మళ్ళీ వచ్చారేమిటి?" మనస్సులోని అనుమానాన్ని బయటపెట్టాడు.
చిన్నగా నవ్వాడు సుధీర్.
“చూడండి సుబ్బారావు గారూ. ఎవరైనా లాడ్జీకి కస్టమర్ వస్తే ఆనందపడాలిగాని అలా ఆశ్చర్యపోతున్నారే” అన్నాడు నవ్వుతూ
“యిప్పుడేగా సర్.. ఏదో అర్జంట్ పనివుందని అంటూ హడావిడిగా వెళ్ళి పోయారు” అంటూ ఆగాడు.
“లాస్ట్ బస్ దాటిపోయింది.. అందుకే తిరిగి వచ్చాను.. రూం తాళం యిచ్చి మల్లిగాడ్ని పంపించు" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సుధీర్.
అతను నాలుగు రోజుల నుండి అదే లాడ్జిలో వుంటున్నాడు. కంపెనీ పనిమీద
బ్రాంచి ఆఫీసు నుంచి హెడ్ ఆఫీసుకి వచ్చాడు సుధీర్... కంపెనీ