పల్లెపడుచు 2
telugu stories kathalu novels పల్లెపడుచు 2 ఓ అద్భుతమైన లోకంలో విహరిస్తూ హఠాత్తుగా అక్కడి నుండి క్రిందపడ్డట్టు ఉలిక్కిపడి ఒంటిపైన ఉన్న దుస్తులు తడిసిపోవడంతో కంగారు పడిపోయారు. ''ఒరేయ్ వెధవల్లారా... ఆసలేమయిందిరా మీకు? ఎవరైనా చూస్తారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా అలా బిగుసుకుపోయి గుడ్లప్పగించి మరీ ఎటో చూస్తున్నారు?'' అన్నాడు కోపంగా.... ''అది కాదురా మామా... ఇందాక మా ప్రక్కనే ఒక మెరుపు మెరిసి మాయమై పోయింది. దానికున్న పవర్ వల్లనే మేమిలా డమ్మీలుగా మారిపోయాము...'' అన్నాడు అజయ్ మైకంగా. ''మెరుపా...? ఏం మెరుపురా...?'' అయోమయంగా అన్నాడు వెంకట్.
''మెరుపంటే మెరుపు కాదురా... అసలింతవరకూ ఇలాంటి మెరుపు ఎక్కడా మెరవలేదేమోరా...'' ,మరింత మైకంగా అన్నాడు సూరి. వారి మాటలకి వెంకట్ కి మరింత చిర్రెత్తుకొచ్చింది. ''లాభంలేదురా ... మీకేదో పిచ్చిపట్టినట్టుంది. అందుకే ఇలా పిచ్చ్జి పిచ్చిగా వాగుతున్నారు... మిమ్మల్ని ఈ క్షణమే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే మీ పిచ్చి కుదుర్తుంది.'' కసిగా అన్నాడు వెంకట్.. ''ఒరే మామా... అంత మాట మాత్రం అనకురా... నువ్వేం చేసినా ఇంకా నాలుగు రోజుల వరకు ఈ ఊరు విడిచి మాత్రం నేను వెళ్ళానురా'' కంగారుగా అన్నాడు అజయ్. ''నేను కూడారా...'' మరింత కంగారుగా అన్నాడు సూరి.
ఇంకాసేపు అక్కడే వుంటే తనకి కూడా పిచ్చిపడుతుందేమో అన్న అనుమానంతో వెంటనే అక్కడినుండి తప్పుకున్నాడు వెంకట్. వెంకట్ వెళ్ళగానే రాము అక్కడికి వచ్చి ఇద్దరినీ గదిలోకి లాక్కెళ్ళాడు. ''ఒరేయ్... మీరు నా పెళ్ళి చూడటానికి వచ్చారా...? లేక ఊళ్ళోవాళ్ళతో మీ ఇద్దరూ 'పెళ్ళిళ్ళు' చేసుకోడానికి వచ్చారా?'' కోపంగా అన్నాడు. ''ఇప్పుడు మేమేం చేసామనిరా అంత కోప్పడుతున్నావు?'' బుంగమూతి పెట్టి అన్నాడు అజయ్. ''ఏం చేసారా... నేను మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను... ఇందాక మీ ముందు నుండి చామంతి