ఓం మహాద్భుతానందాయ నమ 2
telugu stories kathalu novels ఓం మహాద్భుతానందాయ నమ 2 “అబ్బా.. మీ పిచ్చి అనుమానాలు మానండీ.. ఈ స్వామి అలాంటి ఇలాంటి స్వామి కాదు.. మహాద్భుతానంద స్వామీ.. కావాలంటే డెమో కూడా చూపిస్తానని అన్నాడు..” రమ్య మాటలకి అందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. “వస్తువులకి డెమో చూపిస్తారు కానీ.. వరాలకి డెమో చూపించడమేమిటే..!” ఆశ్చర్యంగా అంటుంది రాధ. “చెప్పాను కదా.. ఈ మహాద్భుతానంద స్వామి అలాంటి ఇలాంటి స్వామి కాదని.. లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ అవుతావుంటాడు. అందుకే తాను భక్తులకి ఇచ్చే వరాలకి కూడా డెమో ఇస్తున్నాడు..” గర్వంగా అంటుంది రమ్య. “స్వామివారు డెమో చూపిస్తానని అన్నాక ఇంకా డౌటెందుకు.. వెంటనే పిలిపిస్తే పోలా..” పావని ఆత్రంగా అంటుంది.
“అవునవును.. ఇంకేమీ ఆలస్యం చేయకుండా వెంటనే స్వామివారిని ఫోన్ చేసి పిలిపించు..” అంటుంది రాధ.
డెమో చూపిస్తాడని అనే సరికి అందరిలోనూ ఆ బాబాపై నమ్మకం కలిగింది. తన మాటలని వారు నమ్మడంతో రమ్యం మొహంలో గర్వం చోటు చేసుకుంటుంది. ఉత్సాహంగా చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసి ఓ నంబర్ డయల్ చేస్తుంది.
ఆ మరుక్షణం వారి ప్రక్కన మహాద్భుతానంద స్వామి ప్రత్యక్షం అవుతాడు. స్వామిని చూసిన నలుగురూ పరవశించిపోతారు.. భక్తితో నమస్కారం పెడతారు.
“ఇలా గుర్తు చేసుకున్నామో లేదో అలా ప్రత్యక్షమైపోయారేమిటి స్వామీ..” భక్తితో స్వామి వారికి నమస్కరిస్తూ అంటుంది రాధ.
“హు..హు.. పిచ్చిదానా.. రిలయన్స్ జియో ఫోర్ జీ టెక్నాలజీ నడుస్తున్న ఈ కాలంలో ఇదొక పెద్ద విశేషమా తల్లీ.. పైగా ఈ మహాద్భుతానంద స్వామి చేయనిదంటూ ఏముంటుంది తల్లీ ఈ సృష్టిలో..”
స్వామి వారి మాటలకి అందరూ ముగ్దులయిపోతారు. సరిగ్గా అప్పుడే వారందరికీ ఆయన ఏమయినా చేయగలడని, నిమిషానికి వెయ్యి రూపాయలు సంపాదించే వరాన్ని తమకి ఖచ్చితంగా