నల్లమ్మాయి 3
telugu stories kathalu novels నల్లమ్మాయి 3 శ్రీను గది ముందుకు వచ్చి కాసేపు తటపటాయించింది రాజీ తలుపు తట్టడానికి. తర్వాత ధైర్యం తెచ్చుకుని మెల్లిగా తలుపు తట్టింది. కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా శ్రీను. రాజీని చూసిన శ్రీను ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. నిజంగానే రాజీయేనా తను చూస్తుంది అనిపించింది అతనికి.
శ్రీను తనవైపే చూస్తున్నాడని గ్రహించిన రాజీ మొహం సిగ్గుతో ఎర్రబడింది. రాజీ శ్రీను దగ్గరికి వచ్చి తలవంచుకుని నిలబడింది.
''హేయ్ రాజీ... నిజంగా నువ్వేనా? ఈ రోజేంటి ఎన్నడూ లేని విధంగా ఇంత అందంగా మెరిసిపోతున్నావ్...? వావ్... నీలో ఇంత అందం దాగుందని నాకిప్పుడే తెలిసింది...'' అన్నాడు శ్రీను నవ్వుతూ.
అతను అంటున్న ప్రతీ మాట తన మనసుకి ఎంతో హాయి కలిగిస్తుంటే ఎంతో ఉప్పొంగిపోయింది. శ్రీను రాజీ వైపే చూస్తూ ''రా రాజీ... కూర్చో'' అంటూ లోనికి ఆహ్వానించాడు శ్రీను. మౌనంగా వెళ్ళి కుర్చీలో కూర్చుంది రాజీ... అది బ్యాచిలర్ రూం... శ్రీను ఒక్కడే ఆ రూంలో ఉంటున్నాడు.
ఒక ప్రక్కన కంప్యూటర్, మరో ప్రక్కన బెడ్, ఆ ప్రక్కనే సెల్ఫ్ లో అందంగా పేర్చి ఉన్న బుక్స్ ఎంతో నీటుగా శ్రీనులా అందంగా కనిపించింది రాజీకి ఆ రూం. శ్రీను వంటింట్లోకి వెళ్ళి రెండు నిముషాల్లో టీ చేసుకుని వచ్చాడు. ఒక కప్పు రాజీ చేతికి ఇచ్చాడు. తను కూడా ఆమె ఎదురుగా కూర్చుంటూ ...
''ఊ చెప్పు రాజీ... నా లవ్ లెటర్ వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడిపోయావు కదూ'' అన్నాడు ఆమె వైపే చేస్తూ...
''అబ్బే... అలాంటిదేమీ లేదు...'' అంది కంగారుగా రాజీ...
''నాకంతా తెలుసు... నిన్ను ఆ మోహిని, స్మిత, సంపదలు నేను పంపిన లెటర్ చదివి, నిన్ను బాధపెట్టే విధంగా కామెంట్ చేయడం అంతా విన్నాను... నిజంగా అయాం సారీ రాజీ.