నా తీపి గుర్తులు 145
నా తీపి గుర్తులు 145 “సోనియా చదువు విషయం నువ్వే చూసుకోవాలి….సోనియా స్కూలు నుండి వచ్చిన తరువాత నువ్వే చదివించాలి…..అన్నిటి కంటే ముఖ్యమైనది, ఇదిమాత్రం తప్పితే నేను నిన్ను బయటకు గెంటేస్తాను….అనితని, పిల్లలను నేను చూసుకుంటాను,” అంటూ భాస్కర్ ని భయపెడుతున్నట్టు అతని వైపు చూసాడు రాము.
రాము మాట అనగానే భాస్కర్ మొహంలో భయం చాలా స్పష్టంగా కనిపించింది…అనిత వైపు చూసాడు.
అనిత కూడా భయపడుతున్నట్టు నటించింది.
భాస్కర్ మళ్ళీ రాము వైపు తిరిగి, “నువ్వు చెప్పినట్టే వింటాను….చెప్పు,” అన్నాడు.
భాస్కర్ మాట్లాడుతున్నాడు కాని అతని మాట ఎక్కడో నూతి లోపలి నుండి వస్తున్నట్టు వస్తున్నది.
అనితకి తన భర్తని రాము అంతలా భయపెడుతుంటే చిత్రంగా కోపం రావడం లేదు….ఒక పక్క రాము మాట వినకపోతే వాళ్ళని బయటకు గెంటేస్తానన్నభయం ఇందాక బాగా కనిపించింది….ఇంకో పక్క భాస్కర్ అసమర్ధత, తను రాము మాట వినేలా చేస్తుంది.
రాము భాస్కర్ వైపు చూసి, “ముఖ్యంగా నేను అనిత బెడ్ రూంలో ఉండగా అసలు మమ్మల్ని disturb చేయకూడదు…ఎందుకంటే బయట తిరిగి తిరిగివచ్చి నేను, ఇంట్లో పని చేసి అనిత బాగా అలసిపోతాం కాబట్టి మేము రెస్ట్ తీసుకునే టైంలో నువ్వు అసలు మమ్మల్ని కదిలించకూడదు,” అన్నాడు.
భాస్కర్ కి రాము చెప్పిన దాంట్లో సగం అర్ధం అయింది, సగం అర్ధం కాలేదు….కాని ఎక్కువ ఆలోచించకుండా అలాగే అన్నట్టు తల ఊపాడు.
భాస్కర్ ఇక పూర్తిగా తన grip లోకి వచ్చాడని అర్ధం అవగానే రాము ఇక విషయం చెప్పడానికి అనిత వైపు చూసి, “ఇక అసలు విషయం ఏంటంటే…మారెండో అత్తయ్య వాళ్ళకు ఈ ఊరికి ట్రాన్స్ ఫర్ అయింది…అందుకని వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉంటారట,” అన్నాడు.
రాము చెప్పింది విన్న తరువాత అనితకి, భాస్కర్ కి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది.
ఇద్దరూ రాము ఇంకా ఏం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తున్నారు.
“మరి ఏం చేద్దాం రాము….వాళ్ళు ఎప్పుడు వస్తారంట…..మేము ఎక్కడికి వెళ్ళాలి,” అని గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు వేస్తుంది అనిత.
రాము అనిత భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నాడు.
అనిత వాటర్ బాటిల్ తీసుకుని గబగబ తాగేసి, “ఇప్పుడు చెప్పు,” అన్నది.
“వాళ్ళకి ఇంకా ట్రాన్స్ ఫర్ డేట్ రాలేదు…అప్పటిదాకా మీరు ఇక్కడ ఉండొచ్చు,” అంటూ రాము ఇంకా విషయం చెప్పబోతుండగా మధ్యలో భాస్కర్కల్పించుకుని, “మరి తరువాత ఎక్కడకు వెళ్లాలి?” అన్నాడు.
రాము కోపంగా భాస్కర్ వైపు చూసాడు.
అనితకి కోపం నషాళానికి అంటింది, “నీకు ఒక్కసారి చెబితే అర్ధం కాదా….నువ్వు మనిషివేనా….విషయం చెబుతున్నాడు కదా….మధ్యలోకల్పించుకుంటావే,” అన్నది.
అనిత అలా రియాక్ట్ అవుతుందని ఊహించని భాస్కర్ అనిత వైపు చూసి, ఇంకో మాట మాట్లాడితే కొట్టేటట్టు ఉన్నదని అర్ధం చేసుకుని మెదలకుండాఉన్నాడు.
భాస్కర్ మెదలకుండా ఉండటంతో అనిత, “ఇక నువ్వు చెప్పు,” అంటూ రాము వైపు టెన్షన్ గా చూసింది.
“నేను నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను…మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి రోహిత్ క్లాస్ టీచర్…నేను వాళ్ళబ్బాయి బాలుకి ట్యూషన్ చెబుతాను…వాళ్ళింట్లో పై పోర్షన్ అద్దెకు ఉన్నది....మాట్లాడాను….సాయంత్రం రమ్మన్నది,” అన్నాడు రాము.
ఇక రాము అనిత వాళ్ళని శ్యామల వాళ్ళింట్లో సెట్ చేసి నలుగురం ఎంజాయ్ చెయ్యాలి అని చిన్నగా ప్లాన్ ప్రకారం పావులు కదిలిస్తున్నాడు.
రాము అలా చెప్పగానే అనిత అయోమయంగా